కరోనా మోసాలపై.. గూగుల్ ప్రత్యేక తెలుగు వెబ్‌సైట్
కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించిన మోసాలను గుర్తించేందుకు గూగుల్ సంస్థ ఓ ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌ని మరాఠీ, తమిళం, తెలుగు, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లో అందుబాటులలో తీసుకొచ్చినట్లు..
కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించిన మోసాలను గుర్తించేందుకు గూగుల్ సంస్థ ఓ ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌ని మరాఠీ, తమిళం, తెలుగు, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లో అందుబాటులలో తీసుకొచ్చినట్లు వెల్లడించింది గూగుల్. ఆన్‌లైన్ ద్వారా ఎదురయ్యే సమస్యలు, మోసాల గురించి ఈ వెబ్‌సైట్ సమాచారం అందించి.. వినియోగదారులు సురక్షితంగా ఉండేందుకు సహాయం చేస్తుందని గూగుల్ సంస్థ వెబ్‌సైట్ అధికారులు పేర్కొన్నారు. ఆన్‌లైన్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు అధునాత భద్రత వ్యవస్థను రూపొందించినట్లు వెల్లడించింది గూగుల్.
కోవిడ్-19కు సంబంధించి ఈ మధ్య సైబర్ క్రైమ్స్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 18 మిలియన్ల ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నట్లు తాజాగా గూగుల్ థ్రెట్ అనాలసిస్ బృందం తెలిపింది. వాటికి అదనంగా మరో 240 మిలియన్ల మోసపూరిత మెసేజ్‌లు ఉన్నాయని ఈ బృందం చెప్పింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారు ఈ తరహా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గూగుల్ థ్రెట్ అనాలసిస్ గుర్తించింది. అలాగే వారికి కొత్త మార్గదర్శకాలు చేస్తున్నట్లు గూగుల్ సంస్థ తెలిపింది.
జీ-మెయిల్‌లో ఇప్పటికే గూగుల్ మిషన్ లర్నింగ్ మోడల్స్ ద్వారా 99.9 శాతం స్పామ్, ఫిషింగ్, మాల్వేర్‌ను గుర్తించి తొలగించామని వెల్లడించింది. క్రోమ్ బ్రైజర్‌లోనూ ఈ భద్రత వ్యవస్థను తీసుకురావడం వల్ల ఏదైనా తప్పుడు వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే హెచ్చరిస్తుందని.. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ స్కాన్ ద్వారా మిలియన్ల కొద్ది యాప్స్ సురక్షితంగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. దీని ద్వారా ఇప్పటికే సోషల్ మీడియా యాప్స్, ఆరోగ్య సంస్థలు సహా కరోనా వైరస్ అధికారిక మ్యాప్స్ పేజీల మాదిరిగా ఉండే మాల్‌వేర్‌లను గుర్తించామని పేర్కొంది సంస్థ.
Read More:
వాహనదారులకు గుడ్‌న్యూస్: సీజ్ చేసిన వెహికల్స్ విడుదలకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లోనూ ప్రాణాలు తీసే రసాయనాలెన్నో..
బ్రేకింగ్: మృతుల కుటుంబాలకి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్