AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioCinema: జియో సినిమా ఇకపై ఫ్రీ కాదు.. ఛార్జీలు ఎలా ఉండనున్నాయో తెలుసా.?

ఐపీఎల్‌ 2023 ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకొని కోట్లాది మందికి చేరువైంది జియో సినిమా యాప్‌. అప్పటికే పలు రకాల సినిమాలను అందిస్తోన్న జియో సినిమా ప్రస్తుతం సేవలను ఉచితంగానే అందిస్తోంది. అయితే రానున్న రోజుల్లో జియో సినిమా ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది...

JioCinema: జియో సినిమా ఇకపై ఫ్రీ కాదు.. ఛార్జీలు ఎలా ఉండనున్నాయో తెలుసా.?
Jio Cinema App
Narender Vaitla
|

Updated on: Apr 25, 2023 | 2:50 PM

Share

ఐపీఎల్‌ 2023 ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకొని కోట్లాది మందికి చేరువైంది జియో సినిమా యాప్‌. అప్పటికే పలు రకాల సినిమాలను అందిస్తోన్న జియో సినిమా ప్రస్తుతం సేవలను ఉచితంగానే అందిస్తోంది. అయితే రానున్న రోజుల్లో జియో సినిమా ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఓ వైపు ఐపీఎల్‌ను ఫ్రీగా చూసే వెసులుబాటు కల్పిస్తూనే.. మరోవైపు కొత్తగా తీసుకొచ్చే కంటెంట్‌కు డబ్బులు వసూలు చేయనుంది. ఇదిలా ఉంటే దీనిపై ఇప్పటి వరకు జియో ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట ఓ స్క్రీన్‌ షాట్‌ వైరల్‌ అవుతోంది. దీని ప్రకారం జియో సినిమా వసూలు చేయబోయే ఛార్జీలు ఇవేననే చర్చ జరుగుతోంది.

వీటి ప్రకారం జియో సినిమా నుంచి మూడు ప్లాన్లు రానున్నట్లు సమాచారం. డైలీ, గోల్డ్‌, ప్లాటినమ్‌ పేర్లతో ఈ ప్లాన్లు ఉండనున్నట్లు వైరల్‌ అవుతోన్న స్క్రీన్‌ షాట్స్‌ ఆధారంగా తెలుస్తోంది. గోల్డ్‌ ప్లాన్‌ మూడు నెలల వ్యాలిడిటీతో రానుంది. ఈ ప్లాన్‌ అసలు ధర రూ. 299 కాగా, 67 శాతం డిస్కౌంట్‌తో రూ. 99 కి అందుబాటులోకి రానుంది. ఈ ప్లాన్‌తో రెండు డివైజ్‌లలో జియోసినిమాను ఉపయోగించుకోవచ్చు. ఇక జియోసినిమాలో రానున్న మరో ప్లాన్‌తో రోజుకు కేవలం రూ. 2 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌ అసలు ధర రూ. 29 కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2 కే అందిస్తోంది. ఒకసారి రూ.2 పెట్టి డైలీ ప్యాక్‌ కొనుగోలు చేస్తే 24 గంటల పాటు యాప్‌లో కంటెంట్‌ను వీక్షించొచ్చు. ఒకేసారి రెండు డివైజుల్లో వీక్షించే సదుపాయం ఉంది.

Jio Cinema

ఇవి కూడా చదవండి

ఇక ప్లాటినమ్‌ ప్లాన్ విషయానికొస్తే రూ. 1199 ప్యాక్‌ను 50 శాతం డిస్కౌంట్‌తో రూ. 599కే అందిస్తున్నారు. ఈ ప్లాన్‌లో ఒకేసారి నాలుగు నాలుగు డివైజ్‌లను వినియోగించుకోవచ్చు. ఏడాది వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్‌ ద్వారా లైవ్‌ మినహాయించి కంటెంట్‌ను యాడ్‌ ఫ్రీగా వీక్షించవచ్చు. ఈ ప్లాన్లకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సింది. అయితే ఇది కేవలం జియో యూజర్లకు మాత్రమేనా, అందరికీ వర్తిస్తాయా అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..