Technology: మీ బ్లూటూత్ నెక్ బ్యాండ్, ఇయర్‌బడ్స్ మిస్ అయ్యాయా? మరేం పర్వాలేదు.. ఇలా కనిపెట్టేయొచ్చు..

వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌బడ్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం చాలా ఈజీ. జస్ట్ ఒక్క టచ్‌తో ఫోన్ కాల్స్ మాట్లాడటం, సాంగ్స్ వినడం చేయొచ్చు.

Technology: మీ బ్లూటూత్ నెక్ బ్యాండ్, ఇయర్‌బడ్స్ మిస్ అయ్యాయా? మరేం పర్వాలేదు.. ఇలా కనిపెట్టేయొచ్చు..
Earbuds
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 07, 2023 | 11:37 PM

వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌బడ్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం చాలా ఈజీ. జస్ట్ ఒక్క టచ్‌తో ఫోన్ కాల్స్ మాట్లాడటం, సాంగ్స్ వినడం చేయొచ్చు. వీటిని క్యారీ చేయడం కూడా పెద్ద సమస్యే కాదు. అందుకే అందరూ ఇయర్ బడ్స్ కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఎంతైనా ఫోన్‌ను వినియోగించిన జాగ్రత్తగా, ఫోన్‌కు ఇచ్చినంత ఇంపార్టెన్స్ బ్లూతూట్ ఇయర్‌బడ్స్, ఇయర్ ఫోన్స్‌కు ఇవ్వరు. కాస్త నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడపడేస్తుంటారు. ఒక్కోసారి ఎక్కడ పెట్టామో మర్చిపోయి.. వాటికోసం అంతటా వెతుకుతుంటారు. ఒక్కోసారి వాటిని కోల్పోవాల్సి వస్తుంది కూడా. అయితే, ఇకనుంచి అలాంటి సమస్య లేదు. ఎక్కడ మరిచిపోయినా, లేదా పోగొట్టుకున్నా ఈజీగా కనిపెట్టొచ్చు. అవును, వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌బడ్‌లు మిస్ అయితే, ఇప్పుడు చాలా సులభంగా కనుగొనవచ్చు. ఇందుకోసం చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి..

వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌బడ్‌లను ఎక్కడైనా మర్చిపోయినా.. ఒకవేళ పోగొట్టుకున్నా దానిని తిరిగి కనుగొనడం చాలా సులభం. ఇందుకోసం.. Google Play Store నుండి Wunderfind: Find Lost Device యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్‌కు కనెక్ట్ అయినప్పుడు మీరు ఈ యాప్ సహాయంతో రేంజ్‌ని చెక్ చేయవచ్చు. యాప్‌లోని పరిధిని అనుసరించి స్మార్ట్‌ఫోన్‌ను ఇయర్‌బడ్‌లు ఎక్కడున్నాయో లొకేష్ చూపిస్తుంది. ఈ విధంగా మీ ఇయర్‌బడ్‌లను కనుగొనడం ఈజీ అవుతుంది.

ఇయర్‌బడ్‌లను కోల్పోకుండా ఉండాలంటే ఇది తీసుకోండి..

మీరు వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌బడ్‌లను పదే పదే మర్చిపోతున్నారా? ఈ సమస్యను నివారించడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్‌లో ఓ గాడ్జెట్ అందుబాటులో ఉంది. సిలికాన్ మాగ్నెటిక్ స్ట్రాప్ కేబుల్ ద్వారా దీనిని మర్చిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.75 నుండి ఉంటుంది. దీన్ని ఇయర్‌బడ్స్‌లో అప్లై చేసి మెడలో వేసుకోవచ్చు. దీనిని ఎక్కడైనా ఉపయోగించవచ్చు. తద్వారా మీ ఇయర్ బడ్స్ సేఫ్‌గా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..