- Telugu News Photo Gallery Technology photos Samsung launching new budget smart phone Samsung f04 features and price details Telugu Tech News
Samsung f04: సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. రూ. 6500కే సూపర్ ఫీచర్స్.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్తగా బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. సామ్‌సంగ్ ఎఫ్04 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను జనవరి 12వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది..
Updated on: Jan 07, 2023 | 9:06 PM

సౌత్ కొరియాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. సామ్‌సంగ్ ఎఫ్04 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు.

ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. జనవరి 12వ తేదీన ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్.కాం వెబ్‌సైట్లలో అందుబాటులోకి రానుంది.

మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే 12 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ ధర రూ. 7,499గా ఆఉంది. అయితే ఐసీఐసీ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ లభించనుంది.





























