AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా? ఎంత డేంజరో తెలుసా..

శరీరంలో అధిక భాగం 60 నుంచి 70 శాతం నీటితోనే తయారవుతుంది. అందుకే వైద్యులు ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని చెబుతుంటారు. దీంతో చాలా మంది పడుకునే ముందు కూడా నీళ్లు తాగుతుంటారు. నిజానికి ఈ అలవాటు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి..

రాత్రి నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా? ఎంత డేంజరో తెలుసా..
ఉదయం ఖాళీ కడుపుతో చాలా చల్లటి నీళ్లు తాగడం కంటే గోరువెచ్చని లేదా సాధారణ నీళ్లు తాగడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సహజంగా శరీరంలోని నీటి స్థాయిలను తిరిగి నింపడానికి సహాయపడుతుంది.
Srilakshmi C
|

Updated on: Feb 01, 2026 | 7:14 PM

Share

ఆరోగ్యంగా ఉండాలంటే పుష్కలంగా నీళ్లు తాగడం చాలా ముఖ్యం. శరీరంలో అధిక భాగం 60 నుంచి 70 శాతం నీటితోనే తయారవుతుంది. అందుకే వైద్యులు ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని చెబుతుంటారు. దీంతో చాలా మంది పడుకునే ముందు కూడా నీళ్లు తాగుతుంటారు. నిజానికి ఈ అలవాటు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నిద్రకు భంగం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో, ఎక్కువ నీరు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నీళ్లు తాగడం వల్ల శరీరం చల్లబరుస్తుంది. రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది. ఇంకా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కండరాల నొప్పి తగ్గడమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.

ఎక్కువ నీళ్లు తాగడం వల్ల కలిగే సమస్యలు

పడుకునే ముందు ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలే కాదు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దీని వల్ల నోక్టురియా అనే సమస్య వస్తుంది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. ఇది మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. తగినంత నిద్ర రాకపోవడం వల్ల అలసట, తలనొప్పి, మరుసటి రోజు ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చిరస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ అలవాట్లను తప్పకుండా పాటించండి

  • నీళ్లు తాగిన వెంటనే నిద్రపోవడం మంచిది కాదు.
  • నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు నీళ్లు తాగడం మంచిది.
  • రాత్రి భోజనం చేసిన గంట తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
  • పడుకునే ముందు దాహం వేస్తే, పెద్ద గ్లాసు నీరు తాగడం కంటే కొన్ని సిప్స్ నీళ్లు తాగడం మంచిది.
  • నీళ్లు తాగడం మీ ఆరోగ్యానికి మంచిదే. కానీ అది మీ నిద్రకు భంగం కలిగించకూడదు. కాబట్టి, పడుకునే ముందు సమయానికి అనుగుణంగా నీళ్లు తాగండి. తద్వారా మీ ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకోండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..