Video: బీటెక్ విద్యార్థి చేసిన అద్భుతం! పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా నడిచే వన్ వీల్ బైక్!
సూరత్ బీటెక్ విద్యార్థి అద్భుతమైన సింగిల్ వీల్ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించాడు. పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా పూర్తిగా బ్యాటరీతో నడిచే ఈ బైక్‌లో లిథియం-అయాన్ బ్యాటరీ, ఆటో-బ్యాలెన్స్ సిస్టమ్ ఉన్నాయి. ఈ వన్ వీల్ బైక్ చేయడానికి మూడు నెలలు సమయం పట్టింది.

సాధారణంగా ద్విచక్ర, మూడు చక్రాల లేదా నాలుగు చక్రాల వాహనాలను చూశాము. కానీ ఒకే వీల్ కలిగి బైక్‌ను ఎప్పుడైనా చూశారా? మన దేశంలో అవి పెద్దగా కనిపించవు. కానీ సూరత్‌కు చెందిన ఓ బీటెక్ విద్యార్థి అద్భుతం చేసి చూపించాడు. అతను తయారు చేసిన వన్ వీల్ బైక్‌పై కూర్చున్న తర్వాత ఒక బటన్‌ను ఆన్ చేస్తే.. రైయ్ మంటూ దూసుకెళ్లవచ్చు.
పెట్రోల్, డీజిల్ అక్కర్లేదు..
ఈ బైక్ పూర్తిగా బ్యాటరీతో నడుస్తుంది. దీనికి పెట్రోల్ లేదా డీజిల్ అవసరం లేదు. ప్రారంభంలో పెట్రోల్‌తో పనిచేయాలనే ఆలోచన ఉంది, కానీ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, బ్యాటరీ ఆధారిత వ్యవస్థను ఎంచుకున్నారు. లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఈ ప్రత్యేకమైన బైక్‌ను తయారు చేయడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. అతిపెద్ద సవాలు బ్యాలెన్సింగ్. ఎందుకంటే మొత్తం బైక్‌ను ఒకే చక్రంపై బ్యాలెన్స్ చేయడం అంత తేలికైన పని కాదు. దీని కోసం బైక్ మొత్తం ఫ్రేమ్‌ను దాని గురుత్వాకర్షణ కేంద్రం (CG) సరిగ్గా మధ్యలో ఉండే విధంగా రూపొందించారు.
స్మార్ట్ కంట్రోలర్‌తో ఆటో-బ్యాలెన్స్ సిస్టమ్
బైక్‌లో ఒక ప్రత్యేక కంట్రోలర్‌ను ఏర్పాటు చేశారు, ఇది బైక్ మొత్తం బరువును మధ్యలో సమతుల్యంగా ఉంచుతుంది. ఫలితంగా బైక్ స్టార్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా అదే బ్యాలెన్స్ చేసుకుంటుంది. టెస్ట్ సమయంలో అనేక సార్లు పడిపోయినా.. పట్టువదల కుడా సాధించాడు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
