AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏదో ఒక రోజు నిన్ను చంపుతారని మా నాన్నే అన్నారు.. నటి పూజిత ఎమోషనల్ కామెంట్స్

సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటించి మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అందాల నటిని గుర్తుపట్టారా.? ఆమె పేరు పూజిత. కాగా గతంలో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఏదో ఒక రోజు నిన్ను చంపుతారని మా నాన్నే అన్నారు.. నటి పూజిత ఎమోషనల్ కామెంట్స్
Pujitha
Rajeev Rayala
|

Updated on: Feb 01, 2026 | 7:41 PM

Share

తెలుగు సినీ నటి పూజిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సినిమాల్లో నటించి మెప్పించారు పూజిత. కాగా గతంలో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితం గురించి, సినీ పరిశ్రమలోని కఠిన వాస్తవాల గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. నటీనటులు ఎదుర్కొనే సమస్యల గురించి, మహిళా ఆర్టిస్టుల జీవితంలో ఎదురయ్యే సవాళ్లను గురించి మాట్లాడారు. పూజిత మాట్లాడుతూ.. అవకాశాల కోసం ఎవరినీ పొగడాల్సిన అవసరం లేదని, నిజమైన ప్రతిభ ఉంటేనే పొగడతానని అన్నారు. ఎప్పుడూ పొగరు ఎక్కువ అనే పేరు అంటుంటారని, అది తన స్వభావమని చెప్పారు. తను తప్పుగా మాట్లాడనని, కరెక్ట్ అనిపించింది మాట్లాడతానని అన్నారు. ఒక విషయం తెలిస్తే, అది బయటపెట్టే వరకు ఊరుకోనని, ఎంత పెద్దవారైనా సరే ఇంటికెళ్లి కూడా నిలదీస్తానని చెప్పారు పూజిత.

పూజిత నటుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ, సిల్వర్ స్క్రీన్‌పై గొప్ప విజయం సాధించిన చాలా మంది నటులు, నిజ జీవితంలో మాత్రం 100% విఫలమయ్యారని చెప్పారు. ముఖ్యంగా మహిళా ఆర్టిస్టులలో దాదాపు 95% మందికి వైఫల్యాలే ఎదురవుతాయని, మూడు, నాలుగు పెళ్లిళ్లు, లేదా డబ్బు మనిషి, లేదా వ్యసనపరుడితో వివాహం వంటివి సర్వసాధారణమని అన్నారు. ఇవి కొంతమందికి శాపంలా అనిపిస్తే, మరికొందరికి తమ పిల్లల భవిష్యత్తు కోసం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తారని తెలిపారు. తన వివాహం వెనుక ఉన్న కారణాన్ని కూడా పూజిత పంచుకున్నారు. సినీ పరిశ్రమలో మహిళలు అనవసరమైన వేధింపులు ఎదుర్కోకుండా ఉండటానికి వివాహం ఒక రక్షణగా పనిచేస్తుందని తాను భావించానని అన్నారు.

అయితే, మగాళ్లంటే తనకు ఇష్టం లేదని, ఇది తన ఇంట్లో అందరికీ తెలిసిన విషయమని ఆమె వెల్లడించారు. “మీరు జీవితాన్ని చదివిన మనిషి” అని చాలా మంది తన గురించి అంటారని, అయితే తన జీవితంలో ఎదురైన కష్టాలకు ఒక కారణం ఉందని పూజిత వివరించారు. షూటింగ్‌కు వెళ్తే, ఒక రోజు కూడా గొడవ లేకుండా ఇంటికి రాలేదని, అవి శారీరక దెబ్బల వరకు కూడా వెళ్ళేవని గుర్తుచేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన తండ్రి తీవ్ర ఆందోళన చెందారని చెప్పారు. “ఏదో ఒక రోజు నిన్ను రేప్ చేసి చంపుతారు.. లేనిపోనివన్నీ తెచ్చుకుంటున్నావు. రోజు నువ్వు ఇలా చేసి రావడం, నేను వెళ్లి వాళ్ల కాళ్లు పట్టుకోవడం ఏంటిది?” అని తన తండ్రి తనతో అన్న మాటలను పూజిత ఎమోషనల్ గా మాట్లాడారు. తండ్రి తన భద్రత గురించి పడిన వేదన, ఆయన అండగా నిలిచారని తెలిపింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!
ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!
ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి
ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి
జిమ్‌లో అకస్మాత్తుగా కుప్పకూలడానికి కారణాలేంటి?
జిమ్‌లో అకస్మాత్తుగా కుప్పకూలడానికి కారణాలేంటి?
22 ఏళ్లకే రూ.46 వేలు.. బీకామ్ చదివి క్యాబ్ డ్రైవర్‌గా మారిన యువకు
22 ఏళ్లకే రూ.46 వేలు.. బీకామ్ చదివి క్యాబ్ డ్రైవర్‌గా మారిన యువకు