AI Call Assistant: ఫోన్ మాట్లాడే తీరిక లేదా? అయితే మీ బదులు ఏఐ కాల్ మాట్లాడుతుంది!
రోజురోజుకీ ఏఐలో కొత్త కొత్త అప్‌డేట్స్ వస్తున్నాయి. తాజాగా ఏఐ కాల్ అసిస్టెంట్ అనే కొత్త ఏఐ టూల్ వచ్చింది. ఇది మీకు వచ్చే ఫోన్ కాల్స్ కు ఆటోమేటిక్‌గా రిప్లై ఇస్తుంది. తరచూ ఫోన్ కాల్స్‌తో విసిగిపోతున్న వారికి ఈ టూల్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే..

మీరు ఫోన్ కాల్స్ తో విసిగి పోతున్నారా? మీ కాల్స్ కు ఎవరైనా రిప్లై ఇస్తే బాగుండు అనుకుంటున్నారా? అయితే మీకు ఈ ఏఐ టూల్ హెల్ప్ చేస్తుంది. మీ తరఫున ఏఐ మీ కాల్స్ మాట్లాడుతుంది. దేశంలోనే మొదటి ఏఐ కాల్ అసిస్టెంట్ ను రీసెంట్ గానే లాంఛ్ చేశారు.
ఈక్వల్ ఏఐ
హైదరాబాద్‌కి చెందిన టెక్ స్టార్టప్ ఈక్వల్.. ‘ఈక్వల్ ఏఐ’ పేరుతో సరికొత్త ఏఐ కాల్ అసిస్టెంట్ ను రూపొందించిది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు, టెలీ మార్కెటింగ్ కాల్స్ కు ఈ ఏఐ అసిస్టెంట్ సమాధానమిస్తుంది. అవతలి వాళ్లు అడిగే ప్రశ్నలకు తగ్గట్టుగా ఆన్సర్ చేయగలదు. అంతేకాదు ఏవైనా ఇంపార్టెంట్ కాల్స్ వచ్చినప్పుడు కాల్ రికార్డ్ చేయడం, మేసేజ్ నోట్ చేసుకోవడం వంటివి కూడా చేస్తుంది. స్పామ్ కాల్స్ తో టైం వేస్ట్ అవ్వకుండా ఉండేందుకు అలాగే బిజిగా ఉన్నప్పుడు ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అవ్వకుండా ఉండేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుంది.
ఫీచర్స్ ఇవీ..
ఈక్వల్ ఏఐ ఒక కాల్ మేనేజ్‌మెంట్ టూల్ లా పనిచేస్తుంది. కాల్స్ మిమ్మల్ని విసిగించకుండా ఆ పనంతా అది చూసుకుంటుంది. మనదేశంలో సుమారు 60 శాతం మంది మొబైల్ యూజర్లు రోజుకి నాలుగైదు స్పామ్ కాల్స్ ను ఫేస్ చేస్తున్నారట. దీన్ని అరికట్టేందుకు ఈ టూల్ సాయపడుతుంది. అయితే ఇది కాంటాక్ట్స్ లిస్ట్ లో సేవ్ అయిన నెంబర్లకు రిప్లై ఇవ్వదు. కేవలం కొత్త నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను మాత్రమే లిఫ్ట్ చేసి తగిన ఆన్సర్ ఇస్తుంది. ఉదాహరణకు డెలివరీ ఏజెంట్ ఫోన్ చేస్తే అతను అడిగే అడ్రెస్ వివరాలు చెప్తుంది. ఒకవేళ మీరే మాట్లాడాలి అనుకుంటే మధ్యలో జాయిన్ అయ్యి మాట్లాడొచ్చు.
ఈ యాప్ ను ప్రస్తుతానికి ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే మిగతా నగరాల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం యాండ్రాయిడ్ వెర్షన్ లోనే అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్ యాప్ ను కూడా తీసుకొస్తామని చెప్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




