Self Driving Auto: డ్రైవర్ లేకుండా నడిచే ఆటో! ఎక్కి కూర్చుంటే అదే తీసుకెళ్తుంది!
ఏఐ టెక్నాలజీ పెరిగాక కార్లు, బైక్స్ కూడా అప్ డేట్ అయ్యాయి. ఇప్పటికే కొన్ని ఆటోమొబైల్ బ్రాండ్లు డ్రైవర్ లేకుండా నడిచే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ను తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ కోవలోకి ఆటో కూడా వచ్చి చేరింది. దేశంలో మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో లాంఛ్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే మనదేశంలో డెవలప్ అవుతుంది. అయితే ఇప్పటికవరకూ కార్లకే పరిమితం అయిన ఈ టెక్నాలజీ ఇప్పుడు ఆటో రిక్షా వరకూ చేరుకుంది. డ్రైవర్ అవసరం లేకుండా పూర్తి ఆటోమెటెడ్ గా నడిచే ఆటో రోడ్డెక్కడానికి రెడీగా ఉంది.
సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ ఆటో
ప్రముఖ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ బ్రాండ్ ఒమేగా సీకి మొబిలిటీ.. దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను డెవలప్ చేసింది. ఇది పూర్తిగా ఆటోమేటెడ్‌గా నడుస్తుంది. డ్రైవర్ అవసరం లేకుండానే లొకేషన్ ను రీచ్ అవుతుంది. ఇది లోకల్ ట్రాన్స్ పోర్ట్ లో కొత్త మార్పులు తీసుకురాబోతుందని ఆటో రూపుకర్తలు చెప్తున్నారు.
ఫీచర్స్ ఇవే..
ఒమేగా సీకి సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్యాసింజర్ వెర్షన్ ఇంకా కార్గో వెర్షన్. ప్యాసింజర్ వెర్షన్ మనషుల కోసం, కార్గో వెర్షన్ గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ కోసం డిజైన్ చేశారు. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో 10.3 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇది ఏఐ బేస్డ్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీలో నడుస్తుంది. లైడార్ టెక్నాలజీ, జీపీఎస్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఆరు మీటర్ల దూరం వరకు అడ్డంకులను గుర్తించి తగిన విధంగా రూట్ ను డిజైన్ చేసుకుంటుంది. మల్టీ సెన్సార్ నావిగేషన్, రిమోట్ సేఫ్టీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందుగా ఒక లొకేషన్ సెట్ చేస్తే.. ఆటోమెటిక్ గా, సేఫ్ గా రూట్ ఎంచుకుని గమ్యాన్ని చేరుకోగలదు.
ధరలు
ఈ ఆటో ఫేజ్ 1 ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. ఏడు స్టాప్‌లతో 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంది. ఈ ఆటోలు విమానాశ్రయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండస్ట్రియల్ ఏరియాల్లో బాగా ఉపయోగపడతాయని ప్రతనిధులు చెప్తున్నారు. ఈ ఆటో ధరల విషయానికొస్తే.. ప్యాసెంజర్ వెర్షన్ ధర రూ. 4 లక్షలు, కార్గో వెర్షన్ ధర రూ. 4.15 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. త్వరలోనే డెలివరీలు వెంటనే ప్రారంభమవుతాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




