భూమికి భారీ ముప్పు… ఆ గ్రహశకలాన్ని ఎదుర్కోలేం!

భూమికి భారీ ముప్పు... ఆ గ్రహశకలాన్ని ఎదుర్కోలేం!

కొన్ని లక్షల ఏళ్ల కిందట భారీ గ్రహశకలం భూమిని తాకడం వల్ల డైనోసార్లు, తదితర జంతుజాలం అంతమైన సంగతి తెలిసిందే. మళ్లీ అలాంటి ముప్పే భూమికి పొంచి ఉందని పరిశోధకులు తెలుపుతున్నారు. స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అతి త్వరలో ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని, దాన్ని ఎదుర్కొనేంత సాంకేతిక శక్తి, సామర్థ్యం మన వద్ద లేవని ట్వీట్ చేశారు. అయితే, నాసా ఈ విషయాన్ని […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 22, 2019 | 12:00 PM

కొన్ని లక్షల ఏళ్ల కిందట భారీ గ్రహశకలం భూమిని తాకడం వల్ల డైనోసార్లు, తదితర జంతుజాలం అంతమైన సంగతి తెలిసిందే. మళ్లీ అలాంటి ముప్పే భూమికి పొంచి ఉందని పరిశోధకులు తెలుపుతున్నారు. స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అతి త్వరలో ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని, దాన్ని ఎదుర్కొనేంత సాంకేతిక శక్తి, సామర్థ్యం మన వద్ద లేవని ట్వీట్ చేశారు.

అయితే, నాసా ఈ విషయాన్ని పూర్తిగా కొట్టిపడేయలేదు. అది భూమికి దగ్గరకు వస్తుందనే మాట వాస్తవమేనని తెలిపింది. దాని వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని, అది భూమికి 23,363 మైళ్ల దూరం నుంచి వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. అయితే, అది దిశను మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ట్విస్ట్ ఇచ్చింది. ‘అపోఫిస్‌’ అనే గ్రహశకలం ఏప్రిల్‌ 13, 2029న భూమిని ఢీకొట్టే అవకాశాలున్నాయని పరిశోధకలు అంచనా వేశారు. దీనికి ఈజిప్టు దేవుడు ‘గాడ్‌ ఆఫ్‌ చవోస్‌’ పేరు పెట్టారు.

ఈ గ్రహశకలం పొడవు 1100 అడుగులు ఉంటుంది. ఇది భూమిని ఢీకొడితే 15,000 వేల అణుబాంబుల శక్తి విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విస్ఫోటనం వల్ల భూమి భౌగోళిక మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ గ్రహశకలం భూమి వైపు వచ్చేప్పుడు సూర్యుడి తరహాలో ప్రకాశిస్తోందని తెలిపారు. ఈ గ్రహశకలం భూమిని తాకితే సగం మానవళి అంతం కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది గంటలకు 52,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణిస్తోంది. జూన్ 6, 2027 నాటికి భూమిని సమీపిస్తుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu