Redmi Note 10 Pro: మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్ మీ.. ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Redmi Note 10 Pro: స్మార్ట్ ఫోన్ రంగంలో ఓ పెను సంచలనంగా దూసుకొచ్చింది చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకున్న రెడ్‌మీ...
Redmi Note 10 Pro: స్మార్ట్ ఫోన్ రంగంలో ఓ పెను సంచలనంగా దూసుకొచ్చింది చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకున్న రెడ్‌మీ కొంగొత్త ఫోన్లతో మార్కెట్‌ను కైవసం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే రెడ్‌మీ చైనాలో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 10 ప్రో పేరుతో 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.
ధరల విషయానికొస్తే..
ప్రస్తుతం చైనాలోనే విడుదల చేసిన ఈ ఫోన్‌ను భారత్‌లో ఎప్పడు లాంచ్ చేస్తారన్న దానిపై రెడ్‌మీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే చైనా కరెన్సీని యువాన్‌లను మన రూపాయల్లోకి మారిస్తే ఇండియాలో ఈ ఫోన్ ధరలు ఎలా ఉంటాయో ఓసారి చూద్దాం.
* 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ – రూ. 11,360 * 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ – రూ. 13,625 * 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ – రూ. 15,999 * 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ – రూ. 18,180
ఫీచర్లు..
* 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ఎల్‌సీడీ డిస్‌ప్లే. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్. * ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11పై నడుస్తుంది. * రెయిర్ కెమెరా 64 మెగా పిక్సెల్, సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్. * 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 67 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ దీని సొంతం. * మంచి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందించే క్రమంలో.. స్టీరియో స్పీకర్స్, డాల్బీ ఆటమ్స్ అందించారు.