TESTOSTERONE EFFECT: మగతనమే వారి కొంప ముంచుతోంది..! తక్కువ స్థాయి టెస్టోస్టెరాన్‌ వల్లే కరోనా మరణాలంటున్న కొత్త స్టడీ

ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగాన్ని సృష్టిస్తున్న కరోనా వైరస్ కారణంగా సంభవిస్తున్న మరణాల వెనుక ఓ ఆశ్చర్యకరమైన అంశం వెలుగు చూసింది. తాజాగా వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు అందరినీ ఆశ్చర్యపరిచే ఓ స్టడీ రిపోర్టును...

TESTOSTERONE EFFECT: మగతనమే వారి కొంప ముంచుతోంది..! తక్కువ స్థాయి టెస్టోస్టెరాన్‌ వల్లే కరోనా మరణాలంటున్న కొత్త స్టడీ
Corona Virus
Follow us
Rajesh Sharma

|

Updated on: May 27, 2021 | 4:56 PM

TESTOSTERONE EFFECT FOR CORONA DEATHS: ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగాన్ని సృష్టిస్తున్న కరోనా వైరస్ (CORONA VIRUS) కారణంగా సంభవిస్తున్న మరణాల వెనుక ఓ ఆశ్చర్యకరమైన అంశం వెలుగు చూసింది. తాజాగా వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (WASHINGTON UNIVERSITY SCHOOL OF MEDICINE) సైంటిస్టులు అందరినీ ఆశ్చర్యపరిచే ఓ స్టడీ రిపోర్టు (STUDY REPORT)ను వెలువరించారు. దీని ప్రకారం తక్కువ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ (TESTOSTERONE HARMONE) వున్న మగవారు కరోనా కారణంగా ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నారు. గతంలో ఎక్కువ టెస్టోస్టెరాన్ హార్మోన్ వున్న వారు మరణిస్తున్నట్లుగా భావించారు. కానీ తాజాగా తక్కువ స్థాయిలో హార్మోన్స్ వున్నవారే కరోనా కాటుకు బలవుతున్నారని సైంటిస్టులు (SCIENTISTS) చెబుతున్నారు. దీనికి తాజాగా వారు నిర్వహించిన స్టడీ నివేదికాంశాలను ప్రస్తావిస్తున్నారు.

కరోనా మృతుల (CORONA DEATHS) గణాంకాలను పరిశీలిస్తే.. కరోనా వైరస్ మహిళల కన్నా పురుషులపైనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. మరణాల్లోను పురుషుల సంఖ్యే అధికంగా వుంటుంది. దానికి కారణం మగవారు వివిధ కారణాల వల్ల ఇళ్ళ బయట ఎక్కువ సమయం గడుపుతుంటారు. మహిళలు ఇళ్ళలోనే ఎక్కువగా వుంటూ వుంటారు కాబట్టి.. మగవారికే కరోనా ఎక్కువ సోకుతుంది. దానికితోడు మద్యం, పొగ తాగడం వంటి అలవాట్లు కూడా పురుషుల్లోనే ఎక్కువ. దాంతో కరోనా విషయంలో మహిళలు ఎంతో కొంత సేఫ్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తాజాగా వెల్లడైన స్టడీ ప్రకారం పురుషులకు కరోనా సోకడానికి, అది మరణం వైపు దారి తీయడానికి కారణం పురుషుల్లో మాత్రమే వుండే రీప్రొడక్షన్ హార్మోన్ (RE-PRODUCTION HARMONE) టెస్టోస్టెరాన్ అంటున్నారు. అయితే.. ఈ హార్మోన్ ఎక్కువగా వుండే వారే అధికంగా కరోనా బారిన పడి మరణిస్తున్నారని ఇంతకాలం శాస్త్రవేత్తలు భావించారు. కానీ ఈ అభిప్రాయం సరికాదని తాజాగా వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టుల బృందం ప్రకటించింది. టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ స్థాయిలో వుండే వారిలోనే కరోనా తీవ్రత ఎక్కువగా వుందని, వారే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని తాజా స్టడీ వెల్లడించింది.

బెర్నేస్-జ్యూవిష్ ఆసుపత్రిలో కోవిడ్ లక్షణాలతో చేరిన 90 మంది మగవారు, 62 మంది ఆడవారి రక్తం నమూనాలను సైంటిస్టుల బృందం పరిశీలించింది. వివిధ రోజుల్లో ఈ నమూనాలను సేకరించి.. మగవారి శాంపిళ్ళలో టెస్టోస్టెరాన్, ఆడవారి శాంపిళ్ళలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిల్లో వస్తున్న మార్పులను పరిశీలించారు. మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ మార్పులకు, కోవిడ్ తీవ్రతకు ఎలాంటి రిలేషన్ కనిపించలేదని స్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. కానీ పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయిన వారు మాత్రం మరణం అంచుల దాకా వెళ్ళారు. పలువురు మరణించారు కూడా. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిన పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయి డెసిలీటర్ బ్లడ్‌లో 53 నానోగ్రాములు మాత్రమే వుంది. ఆరోగ్యం బాగా క్షీణించిన మగవారిలో టెస్టోస్టెరాన్ లెవెల్ 19 నానో గ్రాములకు పడిపోయింది. ఈ పరిశీలన తర్వాతనే తక్కువ స్థాయిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ వున్న మగవారికి కరోనా సోకితే ప్రాణాలకు ప్రమాదం ఎక్కువన్న నిర్ధారణకు శాస్త్రవేత్తల బృందం వచ్చింది.

ALSO READ: కాంగ్రెస్ నేతల్లో అంతర్మధనం.. ఈటల విషయంలో ఎక్కడ తప్పు జరిగింది చెప్మా..? అంటున్న లీడర్లు

ALSO READ: అమెరికాతో భారత్ బంధం… మెరుగుదల దిశగా అడుగులు.. జయశంకర్ పర్యటన లక్ష్యమేంటంటే?