Malware Attacks India: భారతీయుల మొబైల్‌ ఫోన్లు టార్గెట్‌గా భారీగా పెరిగిన మాల్వేర్‌ దాడులు.. 5 నెలల్లో ఏకంగా..

Malware Attacks India: భారతీయుల మొబైల్‌ ఫోన్లు టార్గెట్‌గా భారీగా పెరిగిన మాల్వేర్‌ దాడులు.. 5 నెలల్లో ఏకంగా..
Mobile Malware Attack

Malware Attacks India: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం సంభాషణకే పరిమితమైన ఫోన్‌లు ఇప్పుడు అంతకు మించి అన్నట్లు కొంగొత్త ఫీచర్లతో....

Narender Vaitla

|

Apr 15, 2021 | 5:20 PM

Malware Attacks India: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం సంభాషణకే పరిమితమైన ఫోన్‌లు ఇప్పుడు అంతకు మించి అన్నట్లు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇంటర్నెట్‌ సదుపాయం పెరగడం, డేటా ఛార్జీలు విపరీతంగా తగ్గడంతో యాప్‌ల వినియోగం బాగా పెరియిపోయింది. అయితే పెరిగిన ఈ సాంకేతికతతో మంచి జరుగుతుతుందని సంతోషించేలోపే సైబర్‌ దాడులు పెరుగుతున్నాయి. వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంక్‌ ఖాతాల వరకు కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.

ఈ క్రమంలో స్మా్ర్ట్‌ ఫోన్‌లను టార్గెట్‌ చేసుకుంటూ మాల్వేర్‌ దాడులు బాగా పెరుగుతున్నాయి. అంటే వైరస్‌తో కూడిన అప్లికేషన్‌ను స్మార్ట్‌ ఫోన్‌లోకి వంపించి.. ఇతర వ్యక్తులు మన ఫోన్‌లను కంట్రోల్‌ చేస్తుంటారు. తాజాగా ఈ దాడులు బాగా పెరిగాయి. మరీ ముఖ్యంగా భారత్‌లో మొబైల్‌ ఫోన్లపై మాల్వేర్‌ దాడులు పెరిగినట్లు సైబర్‌ భద్రతా సంస్థ చెక్‌ పాయింట్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. 2020 అక్టోబర్‌ నుంచి 2021 మార్చి మధ్య కాలంలో అంటే కేవలం ఐదు నెలల్లో మాల్వేర్‌ దాడులు ఏకంగా తొమ్మిది రెట్లు పెరిగినట్టు ఈ సంస్థ తెలిపింది. 2020 అక్టోబర్‌లో 1,345 దాడులు జరగ్గా.. 2021 మార్చిలో ఈ సంఖ్య 12,719గా ఉందని తేలింది. ఈ మేరకు 2021 మొబైల్‌ సెక్యూరిటీ నివేదికను విడుదల చేసింది. ఇక ఇది కేవలం యూజర్లకే పరిమితం కాకుండా..సంస్థలు కూడా మాల్వేర్‌ దాడులను ఎదుర్కొన్నాయని తెలిపింది. దాదాపు 97 శాతం సంస్థలు 2020లో మొబైల్‌ ముప్పులను ఎదుర్కొన్నాయని.. అంతర్జాతీయంగా 46 శాతం సంస్థల్లో కనీసం ఒక ఉద్యోగి అయినా మాల్వే్‌ర్‌తో కూడిన అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తేలింది.

Also Read: GST Scam: జీఎస్టీకి జీరో దందా దెబ్బ.. ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.3500 కోట్ల ఎగవేత.. షాక్‌లో అధికారులు

AP Weather Alert: ఏపీలో ఆ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం…పూర్తి వివరాలు

Saranga Dariya Song: వెండితెర ‘సారంగదారియా’ సాంగ్ కు బుల్లి తెర నటీమణులు ఓ రేంజ్ లో డ్యాన్స్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu