AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foldable iPhone: ఫోల్డబుల్ ఐఫోన్ ఎందుకు రావడం లేదు? శాంసంగ్‌కు పోటీ ఇవ్వదా?

కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో యాపిల్ ఎప్పుడూ ముందుగానే ఉంటుంది. పైగా చాలా జాగ్రత్తగా ఉంటుంది. యాపిల్‌ ఏదైనా కొత్త టెక్నాలజీని లాంచ్ చేసినప్పుడు, అది పూర్తిగా పరిణతి చెందిన, అద్భుతమైనదిగా ఉండాలని కోరుకుంటుంది. అయితే ఫోల్డబుల్ డిస్‌ప్లే టెక్నాలజీ ఇప్పటికీ స్క్రీన్ మన్నిక, పిక్సెల్ డ్యామేజ్ వంటి కొన్ని..

Foldable iPhone: ఫోల్డబుల్ ఐఫోన్ ఎందుకు రావడం లేదు? శాంసంగ్‌కు పోటీ ఇవ్వదా?
Apple Mobile
Subhash Goud
|

Updated on: Sep 02, 2024 | 9:00 AM

Share

కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో యాపిల్ ఎప్పుడూ ముందుగానే ఉంటుంది. పైగా చాలా జాగ్రత్తగా ఉంటుంది. యాపిల్‌ ఏదైనా కొత్త టెక్నాలజీని లాంచ్ చేసినప్పుడు, అది పూర్తిగా పరిణతి చెందిన, అద్భుతమైనదిగా ఉండాలని కోరుకుంటుంది. అయితే ఫోల్డబుల్ డిస్‌ప్లే టెక్నాలజీ ఇప్పటికీ స్క్రీన్ మన్నిక, పిక్సెల్ డ్యామేజ్ వంటి కొన్ని సమస్యలను ఎదుర్కొంటోంది. ఫోల్డబుల్ ఐఫోన్ రాకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఇందులో సాంకేతిక, మార్కెట్ సంబంధిత సవాళ్లు ఉన్నాయి. యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల శాంసంగ్ వంటి కంపెనీలు తమ ఫోల్డబుల్ ఫోన్ల ద్వారా ముందుకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఇక్కడ కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. సాంకేతికతలో జాగ్రత్తగా అడుగు వేస్తుంటుంది. ఈ సాంకేతికత పూర్తిగా స్థిరంగా ఉండే వరకు Apple బహుశా వేచి ఉండాలనుకుంటోంది.

ఉత్పత్తి నాణ్యత, వినియోగదారు అనుభవం:

యాపిల్‌ ఉత్పత్తుల గురించి ఓ విషయం తెలుసుకోవాలి. అద్భుతమైన నాణ్యత, వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. ఫోల్డబుల్ ఫోన్‌లతో వినియోగదారు అనుభవాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ ఫోన్‌ డిజైన్, మన్నిక, పనితీరు విషయానికి వస్తే.. టెక్నాలజీ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఆపిల్ ఫోల్డబుల్‌కు మరింత ఖర్చు:

ఫోల్డబుల్ ఫోన్‌ల ఉత్పత్తి ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. బహుశా ఈ సాంకేతికతను దాని ఉత్పత్తి శ్రేణిలో చేర్చడానికి ముందు మరింత సరసమైనదిగా చేయడానికి వేచి ఉంది. తద్వారా అది తన వినియోగదారులకు ప్రీమియం ఉత్పత్తిని సహేతుకమైన ధరకు అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

యాపిల్ తన ఉత్పత్తులను ప్రారంభించే వ్యూహంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. శాంసంగ్, ఇతర పోటీదారులను ఓడించి, మార్కెట్‌లో అత్యంత అధునాతనమైన, పరిణతి చెందిన ఫోల్డబుల్ ఫోన్‌లను పరిచయం చేసే సమయం కోసం వేచి ఉంటుంది.

డిమాండ్:

యాపిల్‌ కంపెనీ విస్తృతమైన మార్కెట్ పరిశోధనలు చేస్తుంది. అలాగే ఫోల్డబుల్ ఫోన్‌లకు ఎంత డిమాండ్ ఉందో చూడటానికి వేచి చూస్తుంది. ఇది కేవలం ట్రెండ్ మాత్రమేనని, బదులుగా ఇతర సాంకేతికతలు మరింత సందర్భోచితంగా ఉంటాయని వారు భావిస్తే, దానిని ఆలస్యం చేయవచ్చు. కంపెనీ ఇప్పటికే దాని ప్రస్తుత ఐఫోన్‌ మోడల్‌లను ఇష్టపడే బలమైన, నమ్మకమైన కస్టమర్ బేస్‌ను కలిగి ఉంది. సంస్థ సంవత్సరాలుగా నిర్మించిన కస్టమర్ అనుభవాన్ని కొనసాగించడానికి జాగ్రత్తగా ఉంటుంది.

ఫోల్డబుల్ ఫోన్‌ను తయారు చేయడానికి యాపిల్‌ ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఎందుకంటే తమ అంచనాలకు తగినట్లుగా దీన్ని రూపొందించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో తాజా మెటీరియల్‌లు, డిస్‌ప్లే టెక్నాలజీలు, హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్‌లు ఉండవచ్చు. వీటన్నింటి కారణంగా సామ్‌సంగ్, ఇతర కంపెనీలు ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో ముందంజలో ఉన్నాయి. అయితే యాపిల్‌ ఖచ్చితమైన, అధునాతన ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రవేశపెట్టే సరైన సమయం కోసం వేచి చూస్తుంది. టెక్నాలజీ పరంగా అన్ని విధాలుగా సిద్దమై ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Cylinder Price Hike: వినియోగదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి