AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Clear Fake Threat: క్లియర్‌ ఫేక్‌ పేరుతో మరో ఏఐ టూల్‌ హల్‌చల్‌.. మీరు వాడారో? ఇక అంతే..!

క్రెడిట్ కార్డ్ నంబర్‌లు, క్రిప్టోకరెన్సీ వాలెట్ పాస్‌వర్డ్‌లు, ఐక్లౌడ్‌ కీచైన్ పాస్‌వర్డ్‌లు, ఇతర ఫైల్‌లు ఉంటాయి. ఈ మాల్వేర్ ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్నప్పటికీ మ్యాక్‌ వినియోగదారులకు ఏఎంఓఎస్‌ సోకేందుకు హ్యాకర్లు ఇప్పుడు "క్లియర్‌ఫేక్"గా గుర్తించిన ఫోనీ బ్రౌజర్ అప్‌డేట్‌ చైన్‌ను ఉపయోగిస్తున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డీప్‌ఫేక్ టెక్నాలజీ ఎంత విస్మయం కలిగిస్తుందో? అందరికీ తెలిసిందే. అయితే ప్రజల్లో డీప్‌ఫేక్‌పై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ క్లియర్‌ ఫేక్‌ టెక్నాలజీ యూజర్ల భద్రతను గాల్లో ఉంచుతుంది.

Clear Fake Threat: క్లియర్‌ ఫేక్‌ పేరుతో మరో ఏఐ టూల్‌ హల్‌చల్‌.. మీరు వాడారో? ఇక అంతే..!
Cyber Fraud
Nikhil
| Edited By: TV9 Telugu|

Updated on: Nov 28, 2023 | 5:29 PM

Share

ప్రపంచంలో యాపిల్‌ ల్యాప్‌టాప్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే అధునాతన వైరస్‌ను 2023 ప్రారంభంలో కొత్త సైబర్ ముప్పుగా గుర్తించారు. ఏఎంఓఎస్‌ మాల్వేర్ బాధితుడి పరికరం నుంచి ప్రైవేట్ డేటాను పొందే అవకాశం ఉంది. ఈ డేటాలో క్రెడిట్ కార్డ్ నంబర్‌లు, క్రిప్టోకరెన్సీ వాలెట్ పాస్‌వర్డ్‌లు, ఐక్లౌడ్‌ కీచైన్ పాస్‌వర్డ్‌లు, ఇతర ఫైల్‌లు ఉంటాయి. ఈ మాల్వేర్ ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్నప్పటికీ మ్యాక్‌ వినియోగదారులకు ఏఎంఓఎస్‌ సోకేందుకు హ్యాకర్లు ఇప్పుడు “క్లియర్‌ఫేక్”గా గుర్తించిన ఫోనీ బ్రౌజర్ అప్‌డేట్‌ చైన్‌ను ఉపయోగిస్తున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డీప్‌ఫేక్ టెక్నాలజీ ఎంత విస్మయం కలిగిస్తుందో? అందరికీ తెలిసిందే. అయితే ప్రజల్లో డీప్‌ఫేక్‌పై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ క్లియర్‌ ఫేక్‌ టెక్నాలజీ యూజర్ల భద్రతను గాల్లో ఉంచుతుంది. ఈ క్లియర్‌ ఫేక్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

క్లియర్‌ఫేక్ అనేది ఒక రకమైన డీప్‌ఫేక్ ఇది మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగించి ఇమేజ్‌లు లేదా వీడియోలను వాస్తవంగా కనిపించేలా మార్చడానికి రూపొందించారు. ఇమేజ్ స్ప్లికింగ్, ఫేషియల్ రికగ్నిషన్, వాయిస్ సింథసిస్ వంటి అనేక పద్ధతులను ఉపయోగించడం ద్వారా దీన్ని చేయవచ్చు. ఇది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి నకిలీ వార్తలను సృష్టించడానికి, అలాగే అసలైన వ్యక్తుల్లా కనిపించడానికి ఉపయోగించవచ్చు. సైబర్ థ్రెట్ అలర్ట్ సిస్టమ్‌ల ప్రొవైడర్ అయిన మాల్‌వేర్‌బైట్స్, క్లియర్‌ఫేక్ టెక్నిక్ ద్వారా హ్యాకర్లు మ్యాక్ యూజర్‌లకు ఏఎంఓస్‌ సోకేలా చేస్తున్నారని వివరించారు. 

క్లియర్‌ ఫేక్‌ గురించి విండోస్‌ దాడుల్లో మొదట గుర్తించారు. క్లియర్‌ఫేక్ హ్యాక్ చేసిన వెబ్‌సైట్‌ల ద్వారా నకిలీ సఫారీ, క్రోమ్‌ బ్రౌజర్ నవీకరణలను ప్రచారం చేస్తుంది. హైజాక్ చేసిన వెబ్‌సైట్‌ల ద్వారా విస్తరిస్తున్న నెట్‌వర్క్‌ను ఉపయోగించడం ద్వారా ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ వైరస్‌ను డౌన్‌లోడ్ చేసే వినియోగదారుల నుంచి సున్నితమైన డేటాతో పాటు లాగిన్ ఆధారాలను తస్కరిస్తున్నారు. ఈ వివరాలతో భవిష్యత్‌లో దాడులకు లేదా తక్షణ ఆర్థిక ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. ఏఎంఓఎస్‌ దాని లక్ష్యాల నుంచి డేటాను దొంగిలించే ఒక రకమైన మాల్వేర్-క్లియర్‌ఫేక్ ద్వారా ఇన్‌స్టాల్ చేస్తున్నారు. దాడి చేసేవారు ప్రమాదకరమైన జావాస్క్రిప్ట్ కోడ్‌ను కల్పిత వెబ్‌సైట్‌లలోకి ప్రవేశపెడుతున్నారు. ఒక వ్యక్తి అలాంటి పేజీని యాక్సెస్ చేసిన తర్వాత వారు అధికారిక సఫారీ లేదా క్రోమ్‌ బ్రౌజర్ అప్‌డేట్‌లుగా కనిపించే తప్పుడు ప్రాంప్ట్‌లను పొందుతారు. ఈ నోటిఫికేషన్‌లు ఉద్దేశపూర్వకంగా వినియోగదారులను క్లిక్ చేయడం కోసం రూపొందింలచారు. దీని వలన హానికరమైన ఏఎంఓఎస్‌ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయ్యి ఇన్‌స్టాల్ అవుతుంది. అయితే దీన్ని నుంచి రక్షణ పొందాలంటే తెలియని మూలాల నుండి సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయకపోవడం మంచిది. యాప్ నుంచి నేరుగా సఫారీ, క్రోమ్‌ను అప్‌డేట్ చేయాలి. యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ముందు యాప్‌ సోర్స్‌పై అవగాహనతో ఉండాలి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..