Smartphone Malwares: వెలుగులోకి మూడు కొత్త మాల్వేర్లు.. వీటితో స్మార్ట్ ఫోన్ల పని తీరు మటాష్..!
మాల్వేర్ అనేది హానికరమైన వైరస్. ఇది మీ వ్యక్తిగత పరికరాలైన ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు లేదా కంప్యూటర్‌లలోకి చొరబడవచ్చు. ఈ మాల్వేర్ మన డేటా, గోప్యతకు కూడా హాని కలిగించవచ్చు. అయితే ప్రస్తుతం మరో మూడు కొత్త మాల్వేర్‌లను నిపుణులు కనుగొన్నారు.. ఈ మూడు మాల్వేర్లూ యూజర్ల డేటాను దొంగిలించడం ద్వారా సిస్టమ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. డార్క్ గేట్, ఎమోటెట్, లోకిబాట్ అనే మూడు మాల్వేర్‌లు ప్రమాదకరమైనవిగా నిపుణులు గుర్తించారు.

నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యారు. అయితే టెక్నాలజీ పెరిగే కొద్ది సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే అందరి వ్యక్తిగత డేటా అందులో ఉండడం పరిపాటి. వాటిని తస్కరించడానికి కొత్తకొత్త మాల్వేర్‌లు పుట్టుకొస్తున్నాయి. మాల్వేర్ అనేది హానికరమైన వైరస్. ఇది మీ వ్యక్తిగత పరికరాలైన ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు లేదా కంప్యూటర్‌లలోకి చొరబడవచ్చు. ఈ మాల్వేర్ మన డేటా, గోప్యతకు కూడా హాని కలిగించవచ్చు. అయితే ప్రస్తుతం మరో మూడు కొత్త మాల్వేర్‌లను నిపుణులు కనుగొన్నారు.. ఈ మూడు మాల్వేర్లూ యూజర్ల డేటాను దొంగిలించడం ద్వారా సిస్టమ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. డార్క్ గేట్, ఎమోటెట్, లోకిబాట్ అనే మూడు మాల్వేర్‌లు ప్రమాదకరమైనవిగా నిపుణులు గుర్తించారు. అవి హై-సెక్యూరిటీ సిస్టమ్‌లోకి ప్రవేశించిన తర్వాత సిస్టమ్‌ను హ్యాంగ్ చేస్తాయి. ఈ మూడు మాల్వేర్లు యూజర్ల డేటాను వేగంగా దొంగిలిస్తాయి. ఈ మాల్వేర్ సాఫ్ట్‌వేర్ ఫైల్‌లు, ఈ-మెయిల్ ద్వారా సిస్టమ్‌లోకి ప్రవేశిస్తుంది.
డార్క్‌గేట్ మాల్వేర్
డార్క్‌గేట్ మాల్వేర్ మాల్వేర్ జూన్ 2023లో కనుగొన్నారు. ఈ మాల్వేర్ ఎంత ఘోరమైనదో అది సాధారణ డౌన్‌లోడ్ ఫంక్షన్ కాకుండా విండోస్ డిఫెండర్‌ను డాడ్జ్ చేయడం ద్వారా బ్రౌజర్ చరిత్రను సులభంగా దొంగిలిస్తుంది. డార్క్ గేట్ మాల్వేర్ ఫైల్ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్లి ప్రాక్సీని మార్చడం, డేటాను దొంగిలించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.
ఎమోటెట్ మాల్వేర్
ఎమోటెట్ మాల్వేర్ ఒక బోట్‌నెట్. దీన్ని 2021లో కనుగొన్నారు. ఇది వన్ నోట్ ఫైల్ ద్వారా సిస్టమ్‌లోకి ప్రవేశిస్తుంది. సిస్టమ్‌లో యాక్టివేట్ అయిన తర్వాత ఇది ఇంటర్నెట్ ద్వారా చాలా హానికరమైన ఫైల్‌లను స్వయంచాలకంగా డౌన్‌లోడ్ చేస్తుంది.



లోకిబాట్ మాల్వేర్
లోకిబాట్ మాల్వేర్ మొదటిసారిగా 2016లో కనుగొన్నారు. బ్రౌజర్, ఎఫ్‌టీపీ ఫైల్స్‌తో సహా అనేక ఇతర యాప్‌ల నుంచి వివరాలను దొంగిలించడానికి హ్యాకర్లు ఈ మాల్వేర్‌ను రూపొందించారు. ఈ మాల్వేర్ ఎక్సెల్ డాక్యుమెంట్ ద్వారా మన సిస్టమ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇది సిస్టమ్‌కు చేరుకున్న తర్వాత డేటాను తస్కరిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..