Samsung Smart Tv 4K: వీడియో కాలింగ్ ఫీచర్‌తో సామ్‌సంగ్ నుంచి నయా స్మార్ట్ టీవీ.. తక్కువ ధరకు అదిరిపోయే స్పెసిఫికేషన్లు
ఇటీవల కాలంలో టీవీల విషయంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. టీవీలు కూడా మరింత స్మార్ట్ తయారవుతున్నాయి. ఇప్పుడు ఏ కంపెనీ టీవీ లాంచ్ చేసినా స్మార్ట్ టీవీలనే లాంచ్ చేస్తున్నాయి. తాజాగా సామ్‌సంగ్ వీడియో కాలింగ్ ఫీచర్‌తో సరికొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ టీవీ ధరను సెట్ చేసింది. క్రిస్టల్ విజన్ 4కే యూహెచ్‌డీ టీవీలో వీడియో కాలింగ్ సపోర్ట్, మల్టీ-వాయిస్ అసిస్టెంట్ సామర్థ్యాలు, ఇంటిగ్రేటెడ్ ఐఓటీ హబ్, సౌరశక్తితో నడిచే రిమోట్, ఇతర కార్యాచరణల శ్రేణితో సహా అనేక ఫీచర్లతో వస్తాయి.

భారతదేశంలో గృహోపకరణాల విషయానికి వస్తే సామ్‌సంగ్ కంపెనీలకు ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. ముఖ్యంగా టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు ఇలా అన్ని రకాల గృహోపకరణాలను సామ్‌సంగ్ తయారు చేస్తుంది. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌లో గృహోపకరణాలను రిలీజ్ చేస్తుంది. ఇటీవల కాలంలో టీవీల విషయంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. టీవీలు కూడా మరింత స్మార్ట్ తయారవుతున్నాయి. ఇప్పుడు ఏ కంపెనీ టీవీ లాంచ్ చేసినా స్మార్ట్ టీవీలనే లాంచ్ చేస్తున్నాయి. తాజాగా సామ్‌సంగ్ వీడియో కాలింగ్ ఫీచర్‌తో సరికొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ టీవీ ధరను సెట్ చేసింది. క్రిస్టల్ విజన్ 4కే యూహెచ్‌డీ టీవీలో వీడియో కాలింగ్ సపోర్ట్, మల్టీ-వాయిస్ అసిస్టెంట్ సామర్థ్యాలు, ఇంటిగ్రేటెడ్ ఐఓటీ హబ్, సౌరశక్తితో నడిచే రిమోట్, ఇతర కార్యాచరణల శ్రేణితో సహా అనేక ఫీచర్లతో వస్తాయి. ఈ కొత్త టీవీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
టీవీల ధరలు ఇలా
సామ్‌సంగ్ కంపెనీ మూడు స్క్రీన్ సైజుల్లో 4కే స్మార్ట్ టీవీలను అందిస్తుంది. 43 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల్లో ఈ టీవీలు లభ్యం అవుతాయి. ఈ టీవీల ధర రూ.33,990 నుంచి ప్రారంభమవుతుంది. కానీ, 43-అంగుళాల స్మార్ట్ టీవీ మోడల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 31,490కే అందుబాటులో ఉంది. అయితే 55 అంగుళాల 4 కే స్మార్ట్ టీవీ వేరియంట్ ధర రూ.46,990గా ఉంది. పెద్ద సామ్‌సంగ్ టీవీ కావాలనుకునే వ్యక్తుల కోసం 65 అంగుళాల మోడల్‌ను రూ.71,990కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా ఈ టీవీలను కొనుగోలు చేస్తే అదనంగా బ్యాంకు కార్డుల ఆఫర్‌ను కూడా పొందవచ్చు.
ఫీచర్లు ఇలా
ఈ టీవీ డిస్ప్లే చుట్టూ కనిష్ట బెజెల్స్‌తో సొగసైన డిజైన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్‌లు ఉంటాయి. ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ బదులుగా సామ్‌సంగ్‌కు చెందిన టైజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ టీవీ పని చేస్తుంది. ఈ టీవీ డిస్ప్లే 50హెచ్‌జెడ్‌వద్ద రిఫ్రెష్ అవుతుంది. అలాగే 20 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ముఖ్యంగా ఈ టీవీ రిమోట్ సౌర శక్తిని పొందుతుంది. అంటే రిమోట్ సెల్‌లకు శక్తినివ్వడానికి వెనుకవైపు సోలార్ ప్యానెల్‌తో వస్తుంది. అలాగే ఈ టీవీ గూగుల్ మీట్ వంటి వీడియో కాలింగ్ యాప్‌ల కోసం సపోర్ట్‌ని అందిస్తుంది. కాబట్టి మీరు పెద్ద స్క్రీన్‌పై ఎవరికైనా వీడియో కాల్ చేయవచ్చు. అయితే ఈ టీవీలో అంతర్నిర్మిత కెమెరా లేదు. మీరు దీన్ని విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వెబ్ కెమెరా ధర రూ. 500 నుంచిరూ. 9,000 వరకు ఉంటుంది. మీరు మీ బడ్జెట్ మరియు ఫీచర్లను దృష్టిలో ఉంచుకుని ఏదైనా కొనుగోలు చేయవచ్చు. కొత్త 4కే స్మార్ట్ టీవీ వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి మీకు కావలసిన కంటెంట్‌ను ఎంచుకోవడానికి వాయిస్ అసిస్టెంట్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. ఆటో గేమ్ మోడ్, మోషన్ ఎక్సలేటర్ వంటి ఫీచర్లు ఈ టీవీ సొంతం. ఇది స్మార్ట్ థింగ్స్ ఫీచర్‌కు మద్దతును కూడా కలిగి ఉంది. ఇది మీ స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం