- Telugu News Photo Gallery Technology photos Amazon offers Rs 40000 Discount offer on Samsung Galaxy S20 FE, check to know the smartphone's features and price details
Discount Offer: గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 40,000 తగ్గింపు.. శామ్సంగ్ ముబైల్‌లోని ఫీచర్లు, ధర వివరాలివే..
Samsung Smartphones: భారత్‌లో శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ట్రెండీ ఫీచర్లతో ఎప్పుడూ కస్టమర్ల ఆదరణను పొందే శామ్సంగ్ కంపెనీకి చెందిన ఓ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు ఏకంగా రూ.40 వేల తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ఇంతకీ ఆ ఫోన్ ఏమిటి..? దానిలోని ఫీచర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jul 31, 2023 | 3:45 PM

Samsung Smartphones: శామ్సంగ్ కంపెనీకి చెందని Samsung Galaxy S20 FE స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో అద్దిరపోయే డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ద్వారా మీరు ఏకంగా రూ.40 వేల తగ్గింపు పొందుతారు. శామ్సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 8GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.74,999

అయితే అమెజాన్‌లో అందిస్తున్న భారీ తగ్గింపు ఆఫర్ ద్వారా మీరు ఈ Galaxy S20 FE ఫోన్‌ని కేవలం రూ. 34,999 లకే పొందవచ్చు. ఇంకా ఈ ఫోన్‌పై బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ Samsung Galaxy S20 FE స్మార్ట్‌ఫోన్‌లో 6.5-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, Qualcomm Snapdragon 865 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పాటు 1TB వరకు స్టోరేజీని పెంచుకునే అవకాశం ఉంది.

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రైమరీ కెమెరాగా 12 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 123-డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్ సెకండరీ కెమెరా, 8 ఎంపీ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఇవే కాక 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఇంకా Samsung Galaxy S20 FE స్మార్ట్‌ఫోన్‌లో 4,500mAh బ్యాటరీ బ్యాకప్, 15W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సప్పోర్ట్ ఉన్నాయి.




