- Telugu News Photo Gallery Technology photos Lenovo launching new tab Lenovo tab p12 features and price details Telugu Tech News
Lenovo Tab P12: లెనోవో నుంచి కొత్త ట్యాబ్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ అదుర్స్ అంతే.
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవో భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేస్తోంది. లెనోవో ట్యాబ్ పీ12 పేరుతో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేసింది. రూ. 30 వేల బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్స్‌తో దీనిని తీసుకొచ్చారు. హోల్ సెన్సార్, ఇ-కంపాస్ వంటి, యాక్సిలరోమీటర్, గ్రావిటీ సెన్సార్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఇందులో అందించారు. పవర్ కీపై ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఇంతకీ ఈ ట్యాబ్లెట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Jul 31, 2023 | 1:04 PM

చైనాకు చెందిన టెక్ దిగ్గజం లెనోవో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ పీ12 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారచు.

ఈ ట్యాబ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 12.7 ఇంచెస్ ఎల్‌టీపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 2,944x1,840 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ ప్రత్యేకత.

ఇక ఈ ట్యాబ్ ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,168గా ఉంది. ఆగస్టులో ఈ ట్యాబ్లెట్ ఆన్‌లైన్‌లో సేల్ ప్రారంభం కానుంది.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్లెట్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఇది స్టార్మ్ గ్రే, ఓట్ కలర్ షేడ్స్‌లో అందుబాటులోకి రానున్నాయి.

ఇక లెనెవో ట్యాబ్ పీ12లో 10,200 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 10 గంటల వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ, USB టైప్-C 2.0, WiFi 6 సపోర్ట్ ఈ ట్యాబ్లెట్ సొంతం.





























