- Telugu News Photo Gallery Technology photos Boat launches smartwatch for kids Boat wanderer features and price details Telugu Tech News
BoAt Wanderer: మీ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునే స్మార్ట్ వాచ్.. ఫీచర్స్ తెలిస్తే ఫిదా అవుతారు
ప్రస్తుతం స్మార్ట వాచ్‌ల హవా నడుస్తోంది. రూ. లక్ష మొదలు, రూ. వెయ్యి వరకు మార్కెట్లో స్మార్ట్ వాచ్‌లు లభిస్తున్నాయి. అయితే వీటిలో పెద్దలను టార్గెట్ చేసుకునే వచ్చిన వాచ్‌లే ఉన్నాయి. మరి చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా స్మార్ట్ వాచ్‌లు ఉంటే భలే ఉంటుంది కదూ! దేశీయ టెక్నాలజీ దిగ్గజం బోట్ ఇలాంటి ఓ వాచ్‌ను తీసుకొచ్చింది. పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. బోట్ వండరర్ పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్‌లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఫీచర్లను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ స్మార్ట్ వాచ్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి.? ధర ఎంత? లాంటి వివరాలు మీకోసం..
Updated on: Jul 31, 2023 | 10:26 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం బోట్, పిల్లల కోసం ప్రత్యేకంగా బోట్ వండరర్ పేరుతో ఓ వాచ్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్‌లో 1.4 హెచ్‌డీ డిస్‌ప్లేనును అందించారు. చిన్నారులకు స్క్రీన్ స్పష్టంగా కనిపించేందుకు గాను క్రిస్టల్ క్లియర్ విజువల్స్‌ను అందించారు.

ఈ స్మార్ట్ వాచ్ 4జీ సిమ్‌కు సపోర్ట్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఈ వాచ్‌ను వాటర్ ప్రూఫ్‌గా అందించారు. సిమ్ సపోర్ట్ ఉన్న కారణంగా ఈ వాచ్‌కు నేరుగా వీడియో కాల్ చేసుకోవచ్చు. దీంతో మీ పిల్లలు ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది. అందుకోసం ఇందులో 2 మెగాపిక్సెల్ కెమెరాను కూడా ఇచ్చారు.

అలాగే మీ చిన్నారులు ఎక్కడున్నారో లొకేషన్‌ను కూడా తెలుసుకోవచ్చు. కేవలం వీడియో కాల్ మాత్రమే కాకుండా ఆడియో కాల్ కూడా చేసుకోవచ్చు. ఇందులోని ఎస్‌ఓఎస్ కాలింగ్ ఆప్షన్‌తో పవర్ బటన్‌ను రెండు స్లారు లాంగ్ ప్రెస్ చేస్తే చాలు వెంటనే ఎంపిక చేసుకున్న నెంబర్‌కు ఫోన్ కాల్ వెళ్తుంది.

ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ వాచ్ పేరెంట్స్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్‌ను కనెక్ట్ చేయడం ద్వారా ఈ వాచ్‌ను పెద్దలే కంట్రోల్ చేసుకోవచ్చు. అవసరం లేని సమయంలో వాచ్ పనిచేయకుండా ఫోన్ ద్వారానే చేయొచ్చు.

ఇక మీ పిల్లలు మీ కాలనీ దాటి బయటకు వెళ్లిన వెంటనే ఈ స్మార్ట్ ఫోన్‌ను అలర్ట్ వచ్చేలా సెట్ చేసుకునే ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. వాయిస్ చాట్, ఫొటోస్‌తో పాటు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ వాచ్ అసలు రూ. 15,999కాగా ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌లో భాగంగా రూ. 5999కి లభిస్తోంది.





























