Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Wallet: డిజిటల్‌ ఇండియా వైపు సామ్‌సంగ్‌.. ఆ యూజర్లకు డిజిటల్‌ వ్యాలెట్‌ సౌకర్యం..

తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ అయిన సామ్‌సంగ్‌ తన గెలాక్సీ యూజర్ల కోసం ఈ-వ్యాలెట్‌ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు ప్రస్తుతం ఈ-వ్యాలెట్‌ ద్వారా తమ ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాల వంటివి ఈజీగా యాక్సెస్‌ చేసుకోవచ్చు.

Samsung Wallet: డిజిటల్‌ ఇండియా వైపు సామ్‌సంగ్‌.. ఆ యూజర్లకు డిజిటల్‌ వ్యాలెట్‌ సౌకర్యం..
Samsung Wallet
Follow us
Srinu

|

Updated on: Jul 26, 2023 | 3:45 PM

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. వాటి ద్వారా ఎన్నో సదుపాయాలను మనం అనుభవిస్తున్నాం. ఈ విషయాన్ని పక్కన పెడితే మన గుర్తింపునకు రుజువులను గతంలో ఎప్పుడూ మనతోనే ఉంచుకునేవాళ్లం.  ఒక్కోసారి వీటిని ఇంట్లో మర్చిపోతూ ఉంటాం. అలాగే వీటిని తరచూ మనతో ఉంచుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం వీటిని మనం వాడే ఫోన్స్‌లో ఆయా కార్డులను యాక్సెస్‌ చేసుకునే సదుపాయం ఉండేలా భారతదేశం ప్రభుత్వం డిజిటల్‌ ఇండియాకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా డిజిలాకర్‌ సర్వీసు ఇటీవల కాలంలో ఎక్కువ మంది వాడుతున్నారు. ఇప్పుడు ప్రైవేట్‌ సంస్థలు కూడా డిజిటల్‌ ఇండియాకు సహకారం అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ అయిన సామ్‌సంగ్‌ తన గెలాక్సీ యూజర్ల కోసం ఈ-వ్యాలెట్‌ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు ప్రస్తుతం ఈ-వ్యాలెట్‌ ద్వారా తమ ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాల వంటివి ఈజీగా యాక్సెస్‌ చేసుకోవచ్చు. అంతే ఈ ఈ’-వ్యాలెట్‌ ద్వారా ఎన్నో సదుపాయాలను కూడా ఇస్తుంది. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. 

సామ్‌సంగ్‌ యూజర్లు ఈ ఈ-వ్యాలెట్‌ సదుపాయంతో వివిధ పత్రాలను యాక్సెస్‌ చేడయంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న సామ్‌సంగ్‌ పే, సామ్‌సంగ్‌ పాస్‌ల కార్యాచరణలు కూడా సులభంగా చేసుకునే అవకాశం ఉంది.  అలాగే సామ్‌సంగ్‌ వ్యాలెట్‌ కొత్త ప్రయాణ, మొబిలిటీ ఫీచర్‌ల శ్రేణిని పరిచయం చేసింది. ఈ మెరుగుదలతో వినియోగదారులు ఇప్పుడు సౌకర్యవంతమైన కార్డ్ ట్యాప్, పే ఎంపికలను కూడా ఆస్వాదించవచ్చు, అలాగే యూపీఐ చెల్లింపులు కూడా ఈజీగా3 నిర్వహించవచ్చు. ఇవ్వన్నీ కూడా గతంలో విడివిడిగా ఉండే సేవలను సామ్‌సంగ్‌ వ్యాలెట్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వా చేసుకోవచ్చు. అలాగే వినియోగదారులకు వారి కార్లకు సంబంధించి ఫాస్టాగ్‌ ఖాతాను కూడా రీచార్జ్‌ చేసుకోవచ్చు. అలాగే రైలు టిక్కెట్లను కూడా బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది. వినియోగదారులు తమ రైలు ప్రయాణాల స్థితిని ఇతర కార్యాచరణలతో సౌకర్యవంతంగా తనిఖీ చేయవచ్చు. రైలు టిక్కెట్‌లు లేదా బోర్డింగ్ పాస్‌లను జోడించడానికి వినియోగదారులు క్యూఆర్‌ లేదా బార్‌కోడ్‌ను స్కాన్ చేసుకోవచ్చు. 

2000 పత్రాల యాక్సెస్‌

సామ్‌సంగ్ వ్యాలెట్ ద్వారా నేరుగా విమానాశ్రయ ప్రవేశానికి అవసరమైన గుర్తింపు రుజువు, ప్రయాణ పత్రాలను సమర్పించే సామర్థ్యాన్ని వినియోగదారులు కలిగి ఉంటారని కంపెనీ పేర్కొంది . నాలుగు ప్రాథమిక డిజిటల్ ఐడీలతో పాటు ఆధార్ కార్డ్, పాన్‌ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో సహా 2,000 పైగా ఇతర ఐడీలు/పత్రాలకు యాక్సెస్‌ను మంజూరు చేస్తుంది. అలాగే విమాన ప్రయాణినికి అవసరమైన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డిజిటల్‌ ఇండియా వైపు అడుగులు వేస్తున్న భారతదేశానికి బలమైన భాగస్వామిగా ఉండాలనే ఈ కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతున్నట్లు సామ్‌సంగ్‌ ప్రతినిధులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం