Noise Smartwatch: నాయిస్ నుంచి మరో స్మార్ట్ వాచ్.. అతి తక్కువ ధర.. అదిరిపోయే ఫీచర్లు..
ఇప్పుడు లాంచ్ అయిన కొత్త మోడల్లో పెద్ద డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్, వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్లతో పాటు ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మార్కెట్లో స్మార్ట్ వాచ్ లకు మంచి డిమాండ్ ఉంది. వయసుతో భేదం లేకుండా అందరూ వీటిని వినియోగిస్తున్నారు. దీంతో అన్ని కంపెనీలు విరివిగా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ టెక్ బ్రాండ్ అయిన నాయిస్ కూడా మరో కొత్త స్మార్ట్ వాచ్ ను మన దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. అనువైన బడ్జెట్లోనూ ఉత్తమ ఫీచర్లతో దీనిని తీసుకొచ్చింది. నాయిస్ కలర్ ఫిట్ లైనప్ లో మరో కొత్త మెంబర్ యాడ్ అయినట్లుగా కంపెనీ ప్రకటించింది. ఈ వాచ్ పేరు నాయిస్ కలర్ ఫిట్ స్పార్క్. ఇప్పటికే నాయిస్ నుంచి కలర్ ఫిట్ లైనప్ లో కలర్ ఫిట్ విజన్ 3, కలర్ ఫిట్ పల్స్ 3, కలర్ ఫిట్ మైటీ, కలర్ ఫిట్ క్వాడ్ సెల్ వంటి మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు లాంచ్ అయిన కొత్త మోడల్లో పెద్ద డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్, వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్లతో పాటు ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నాయిస్ కలర్ ఫిట్ స్పార్క్ ధర, లభ్యత.. నాయిస్ కలర్ ఫిట్ స్పార్క్ ప్రారంభ ధర రూ. 1,999గా ఉంది. ఇది ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఫారెస్ట్ గ్రీన్, చార్కోల్ గ్రే, సిల్వర్ గ్రే, కోబాల్ట్ బ్లూ, జెట్ బ్లాక్, డీప్ వైన్ రంగుల్లో ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో జూలై 25 నుండి అమ్మకానికి వచ్చింది. అలాగే దీన్ని అధికారిక నాయిస్ వెబ్‌సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు.
నాయిస్ కలర్‌ఫిట్ స్పార్క్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు.. నాయిస్ కలర్ ఫిట్ స్పార్క్ స్మార్ట్ వాచ్ లోని ప్రధాన ఆకర్షణ దాని లుక్ అని చెప్పాలి. ఇది 2-అంగుళాల టీఎఫ్టీ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇతర 1.85-అంగుళాల డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్‌లతో పోలిస్తే దాని కొత్త స్మార్ట్‌వాచ్ విజువల్ ఏరియాలో 17% పెరుగుదల మరియు బెజెల్స్‌లో 15% తగ్గుదలని అందజేస్తుందని నాయిస్ తెలిపింది.




- ఇది స్మార్ట్‌వాచ్ రూపాన్ని, అనుభూతిని వ్యక్తిగతీకరించడానికి వినియోగదారులను అనుమతించే 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. దీనిలో ఉండే మెనూలో అనేక రకాల ఆప్షన్లు ఉంటాయి. ఈ స్మార్ట్ వాచ్ కు పక్కనే ఫిజికల్ క్రౌన్ కూడా ఉంటుంది.
- నాయిస్ కంపెనీ వివిధ ఆరోగ్య, ఫిట్‌నెస్ ఫీచర్‌లతో కలర్‌ఫిట్ స్పార్క్‌ను ప్యాక్ చేసింది. ఇది మీ విభిన్న శారీరక కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. ఇతర ఆరోగ్య లక్షణాలలో స్లీప్ ట్రాకర్, 24×7 హార్ట్ రేట్ మోనిటర్, స్ట్రెస్ మేనేజర్, ఒక ఎస్పీఓ2 సెన్సార్, మహిళలకు పీరియడ్ ట్రాకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
- స్మార్ట్ వాచ్ నాయిస్ లో ఉండే ట్రూ సింక్ సాంకేతికతతో బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 7 రోజుల వరకు బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటుంది. అనుకూలమైన ఛార్జింగ్ అనుభవం కోసం వైర్‌లెస్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది.
ఇటీవల దేశంలో నాయిస్ మూడు కొత్త స్మార్ట్‌వాచ్‌లను హాలో ప్లస్, నోవా, ఆర్క్‌లను పరిచయం చేసింది . హాలో ప్లస్ రూ. 4,499 ధర ట్యాగ్‌తో లైనప్‌లో అత్యంత ఖరీదైనది నిలిచింది. ఇది ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో హై-రిజల్యూషన్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. స్మార్ట్ వాచ్ దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం ఐపీ68 రేటింగ్ తో వస్తుంది. ఇతర రెండు స్మార్ట్‌వాచ్‌లు నోయిస్ నోవా, ఆర్క్ ధరలు వరుసగా రూ.2,999 , రూ.1,399గా ఉన్నాయి. వివిధ కలర్ ఆప్షన్లతో పాటు ఆరోగ్యం, ఫిట్‌నెస్ ఫీచర్లను ఇవి కలిగి ఉన్నాయి. అలాగే నాయిస్ హెల్త్ సూట్, నాయిస్ ఫిట్ కంపానియన్ యాప్ ఉంటుంది. దీనిలోని పవర్ సేవింగ్ మోడ్‌ని ఉపయోగించి 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..