- Telugu News Photo Gallery Technology photos Oppo launching new smart phone Oppo K11 5G features and price details
Oppo K11 5G: ఒప్పో నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది.. 26 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్. ధర ఎంతో తెలుసా.?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో కే11 పేరుతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్ చైనాలో అందుబాటులోకి రాగా త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Jul 26, 2023 | 4:23 PM

స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో కే11 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్‌తో తీసుకొచ్చారు. త్వరలోనే భారత మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.

ఒప్పో కే11 స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ 6ఎన్‌ఎం క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జీ ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 100 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందించారు. 10 నిమిషాల్లో 50 శాతం, 26 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.

ధర విషయానికొస్తే ఇండియన్ కరెన్సీ ప్రకారం 8 జీబీ రామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 21వేలు, 12 జీబీ రామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 24 వేలు, 12 జీబీ రామ్, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 29,000గా ఉండనుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ + ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్, 240 హెర్ట్జ్ టచ్ శాంపింగ్ రేట్ ఈ ఫోన్ ప్రత్యేకత.

ఇక కెమెరా విషయానికొస్తే ఒప్పో కే 11 స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ప్రాగ్జిమిటీ సెన్సర్ తోపాటు బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి.





























