- Telugu News Photo Gallery Technology photos These are the super smart watches under Rs.5000,these are the best offers in amazon
Smart Watches Under 5000: రూ.5 వేల లోపు సూపర్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే.. అమెజాన్ ఆఫర్స్ తెలిస్తే ఎగిరిగంతేస్తారు..
ప్రస్తుతం కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యువత స్మార్ట్ వాచ్‌లను విపరీతంగా వాడుతున్నారు. అలాగే ఈ స్మార్ట్ వాచ్‌లో ఆరోగ్య సంబంధిత ఫీచర్లు కూడా ఉండడంతో ఎక్కువ మంది మధ్య వయస్కులు కూడా ఇష్టపడుతున్నారు. ఈ స్మార్ట్ వాచ్‌లు కూడా తక్కువ ధరకు లభించడంతో అందరినీ ఆకర్షిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రూ.5 వేల లోపు అందుబాటులో ఉన్న టాప్ 5 స్మార్ట్ వాచ్‌లపై ఓ లుక్కేద్దాం.
Srinu |
Updated on: Jul 26, 2023 | 3:15 PM

అమెజ్ బిప్ 3 స్మార్ట్ వాచ్ కూడా 50 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ దర రూ.4999గా ఉంటే ప్రస్తుతం రూ.2499కు అందుబాటులో ఉంది.

బోట్ ఎక్స్‌టెండ్ స్మార్ట్ వాచ్‌పై అదిరిపోయే తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ వాచ్ ఏకంగా 71 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ వాచ్ ధర రూ.7990గా ఉంటే రూ.2299కు అందుబాటులో ఉంది.

రూ.1299కే అందుబాటులో ఉండే బోట్ కంపెనీకు చెందిన వేవ్‌కాల్ వాచ్ బెస్ట్ స్మార్ట్‌వాచ్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ స్మార్ట్ వాచ్ 84 శాతం తగ్గింపు ధరతో లభిస్తుంది. సాధారణంగా దీని ధర రూ.7799గా ఉంది.

రియల్‌మీ టెక్ లైఫ్ స్మార్ట్ వాచ్ ఎస్‌జెడ్ 100 ప్రస్తుతం అమెజాన్‌లో 43 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ వాచ్ ధర రూ.3999గా ఉంటే ప్రస్తుతం రూ.2289కు లభిస్తుంది.

రూ.5999గా ఉండే రియల్‌మీ వాచ్ 2 ప్రో అమెజాన్‌లో 34 శాతం తగ్గింపుతో రూ.3950కు అందబాటులో ఉంది. ఈ వాచ్‌లో ఉండే ఫీచర్లు యువతను ఎక్కువగా ఆకట్టకుంటున్నాయి.





























