HearPods: మ్యూజిక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. అద్భుతమైన సౌండ్ క్లారిటీ.. అతి తక్కువ ధరలోనే..
అతి తక్కువ ధరలోనే ఇయర్ బడ్స్ ను ప్రముఖ టెక్ బ్రాండ్ హియర్ మో లాంచ్ చేసింది. హియర్ పాడ్స్ పేరిట వీటిని విడుదల చేసింది. కేవలం రూ. 799 నుంచి వీటి ధర ప్రారంభమవుతుంది.

మీరు సంగీత ప్రియులా? ఎక్కడి వెళ్లినా ఇయర్ ఫోన్లు లేదా బడ్స్ తప్పనిసరిగా ఉండాలా? అయితే మీకో శుభవార్త? అతి తక్కువ ధరలోనే ఇయర్ బడ్స్ ను ప్రముఖ టెక్ బ్రాండ్ హియర్ మో లాంచ్ చేసింది. హియర్ పాడ్స్ పేరిట వీటిని విడుదల చేసింది. కేవలం రూ. 799 నుంచి వీటి ధర ప్రారంభమవుతుంది. ఈ హియర్ పాడ్ లైనప్ లో హియార్ పాడ్స్ మినీ, హియర్ పాడ్స్ ప్రో, హియర్ పాడ్స్ ప్రో2 ఏఎన్సీ, హియర్ పాడ్స్ ఎయిర్ వంటి మోడళ్లు ఉన్నాయి. వీటిల్లో బ్లూటూత్ 5.3 కనెక్టివీటితో పాటు ఇన్విరాన్ మెంటల్ క్యాన్సలేషన్(ఈఎన్సీ) టెక్నాలజీతో వస్తోంది. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
హియర్ పాడ్స్ మినీ.. దీనిలో 13ఎంఎం డైనమిక్ డ్రైవర్ రెండు ఎంఈఎంఎస్ మైక్రో ఫోన్లు ఉంటాయి. దీనిలోని బ్యాటరీ 14 గంటల రన్నింగ్ టైంని అందిస్తుంది. యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ కనెక్టర్ అందిస్తారు. అలాగే వినియోగదారుడు సౌకర్యవంతంగా వినియోగించుకోడానికి టచ్ కంట్రోల్స్ ఉంటాయి. వీటితో మ్యూజిక్, కాల్స్ ను నియంత్రించొచ్చు. ఈ హియర్ పాడ్స్ మినీ ధర రూ. 799గా ఉంది. ఇది రిటైల్ అవుట్ లెట్లతో పాటు హియర్మో బ్రాండ్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంది.
హియర్ పాడ్స్ ప్రో.. దీనిలో కూడా 13ఎంఎం డైనమిక్ డ్రైవర్ ఐపీఎక్స్4 రేటింగ్ తో వాటర్, స్వెట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. దీని ధర రూ. 1199గా ఉంది. ఇది కూడా బయట రిటైల్ స్టోర్స్ తో పాటు హియర్మో బ్రాండ్ వెబ్ సైట్లో కొనుగోలు చేయొచ్చు.




హియర్ పాడ్స్ ప్రో 2 ఏఎన్సీ.. ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్(ఏఎన్సీ) టెక్నాలజీతో వస్తుంది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉంటుంది. టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ 10ఎంఎం డైనమిక్ డ్రైవర్ తో పాటు ఏఏేసీ సపోర్టుతో ఎంఈఎంఎస్ మైక్రో ఫోన్లు ఉంటాయి. ఈ హియార్ పాడ్స్ ప్రో 2 ఏఎన్సీ ధర రూ. 1699గా ఉంది. ఇదీ బయట రిటైల్ స్టోర్స్ తో పాటు కంపెనీ సైట్లో కూడా కొనుగోలు చేయొచ్చు.
మంచి సౌండ్ క్లారిటీ..
ఈ సందర్భంగా హియర్మో ఫౌండర్, సీఈఓ మహేంద్ర డీ జాన్ గిర్ మాట్లాడుతూ తాము ఎంతో ఉత్సాహంగా ఈ కొత్త ఇయర్ పాడ్స్ లైనప్ ను పరిచయం చేశామన్నారు. అద్భుతమైన సౌండ్, స్టైల్ ఇది వినియోగదారులకు అందిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ ఇవి అద్భుతమైన అనుభూతిని అందిస్తాయని పేర్కొన్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..