Dangerous App: ఆ యాప్‌తో తస్మాత్ జాగ్రత్త.. మీ డేటా మొత్తం చోరీ! మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..

ఈసెట్(ESET) అనే ఓ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆండ్రాయిడ్ యూజర్లకు ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులు గ్లూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకొనే ఓ యాప్ లో హానికరమైన వైరస్ ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. అది 2021 సెప్టెంబర్ నుంచి వ్యక్తుల డేటాను దొంగిలిస్తున్నట్లు వివరించింది.

Dangerous App: ఆ యాప్‌తో తస్మాత్ జాగ్రత్త.. మీ డేటా మొత్తం చోరీ! మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Android Malware
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Jun 22, 2023 | 6:30 AM

సాంకేతికత ఎంతలా వృద్ధి చెందుతున్నా.. అదే స్థాయిలో నేరగాళ్లు కూడా తమ కొత్త కొత్త మార్గాలను వెతుక్కుంటూ దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో డేటా చోరీ, సైబర్ నేరాలు అధికమయ్యాయి. ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక రూపంలో సైబరాసురులు మన వ్యక్తిగత డేటా దొంగిలిస్తూ.. ఆపై బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో ఈసెట్(ESET) అనే ఓ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆండ్రాయిడ్ యూజర్లకు ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులు గ్లూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకొనే ఓ యాప్ లో హానికరమైన వైరస్ ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. అది 2021 సెప్టెంబర్ నుంచి వ్యక్తుల డేటాను దొంగిలిస్తున్నట్లు వివరించింది. ఆ యాప్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? దాని నుంచి రక్షణ పొందాలంటే ఏం చేయాలి. తెలుసుకుందాం రండి..

ఐ రికార్డర్- స్క్రీన్ రికార్డర్..

ఈసెట్ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ సంస్థ ప్రకటించిన దాని ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న ఐ రికార్డర్ స్క్రీన్ రికార్డర్ యాప్ ద్వారా హానికరమైన మాల్వేర్ మన ఫోన్లలోకి వస్తుంది. ప్రస్తుతం దీనిని ప్లే స్టోర్ తొలగించినప్పటికీ.. 2021, సెప్టెంబర్ 19 నుంచి దాదాపు 50,000 డౌన్ లోడ్లు ఈ యాప్ కు ఉన్నట్లు పేర్కొంది. అయితే తొలిసారి దానిని ప్లే స్టోర్ అప్ లోడ్ చేసినప్పుడు దానిలో ఎటువంటి హానికరమైన వైరస్ లు లేవని.. కానీ 2022 ఆగస్టులో ఈ యాప్ అప్ డేట్ చేశారని.. ఆ అప్ డేట్ లోనే హానికరమైన మాల్వేర్ జొప్పించినట్లు వివరించింది.

ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే..

ఈ స్క్రీన్ రికార్డర్ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల ఫోన్ల నుంచి సేవ్ చేసిన వెబ్ పేజీలు, ఇమేజ్ లు, వీడియో, డాక్యుమెంట్ ఫైల్స్, ఫైల్ ఫార్మాట్లు ద్వారా డేటా చోరీ చేస్తోంది. అలాగే ఇది మైక్రో ఫోన్ రికార్డింగ్స్ ను కూడా తీసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇలా చేస్తే మీరు సేఫ్..

ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్పటికే తొలిగించారు. మీరు ఇప్పటికే ఈ యాప్ ను మీ ఫోన్లో కలిగి ఉంటే దానిని వెంటనే డిలీట్ చేసేయాలి. అలాగే సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఇటువంటి మాల్వేర్ ల నుంచి సేఫ్ గా ఉండటానికి పులు సూచనలు చేస్తున్నాయి. అవేంటో చూద్దాం..

  • థర్డ్ పార్టీ వద్దు.. మీరు ఏదైనా యాప్ డౌన్ లోడ్ అధిక రిప్యూటేషన్ ఉన్న యాప్ స్టోర్ల నుంచి మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. అలాగే థర్డ్ పార్టీ యాప్ లను వినియోగించవచ్చు. ఎందుకంటే వీటిని గూగుల్ వీటని రివ్యూ చేయదు.
  • యాప్ రివ్యూలు చూడండి.. ఏదైనా యాప్ ను డౌన్ లోడ్ చేసే ముందు ఆ యాప్ నకు సంబంధించిన రివ్యూలు ముందు చదవండి. దానిలో ఎదైనా స్ట్రేంజ్ విషయాలు ఉంటే ఆ యాప్ కి దూరంగా ఉండండి.
  • ఫ్రీ యాంటీ వైరస్ లను వాడొద్దు.. ఫ్రీ యాంటీ వైరస్ ట్రయల్స్ ని వాడొద్దు. వాటిల్లోనే మాల్వేర్ అధికంగా ఉంటాయి. మీ డివైజ్ ని ఎటాక్ చేసి డేటా కాజేస్తాయి.
  • మీ ఫోన్ అప్ డేటెడ్ గా ఉంచుకోండి.. మీ ఫోన్ ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంచుకోండి. ఎందుకంటే కొత్త అప్ డేట్లలో సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి.
  • అలాగే మీ డివైజ్ పనితీరుపై పాప్ అప్ లను, పలు రకాల యాడ్స్ లను క్లిక్ చేయొద్దు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!