Noise fit Smartwatch: ఏడు రోజుల బ్యాటరీ లైఫ్.. 100 వాచ్ ఫేసెస్.. ఈ స్మార్ట్ వాచ్ రేంజ్ మామూలుగా లేదుగా..

నాయిస్ ఫిట్ క్రూ ప్రో స్మార్ట్ వాచ్ మూడు ఆకర్షణీయ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. 1.4అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ట్రూ సింక్ టెక్నాలజీతో కూడిన బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఈ వాచ్ లో మరో విశేషం ఏమిటంటే 100 వాచ్ ఫేసెస్ ఉంటాయి.

Noise fit Smartwatch: ఏడు రోజుల బ్యాటరీ లైఫ్.. 100 వాచ్ ఫేసెస్.. ఈ స్మార్ట్ వాచ్ రేంజ్ మామూలుగా లేదుగా..
Noisefit Crew Pro Smartwatch
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Jun 22, 2023 | 7:00 AM

ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్ ల వినియోగం బాగా పెరిగింది. అన్ని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ కంపెనీ నాయిస్ కూడా మరో సరికొత్త స్మార్ట్ వాచ్ ను తీసుకొచ్చింది. నాయిస్ ఫిట్ క్రూ ప్రో స్మార్ట్ వాచ్ పేరుతో దీనిని మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది మూడు ఆకర్షణీయ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. 1.4అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ట్రూ సింక్ టెక్నాలజీతో కూడిన బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఈ వాచ్ లో మరో విశేషం ఏమిటంటే 100 వాచ్ ఫేసెస్ ఉంటాయి. వినియోగదారుల అభిరుచి, వారి స్టైల్ కి అనుగుణంగా వాచ్ ఫేస్ ని మార్చుకోవచ్చు. అలాగే బ్యాటరీ లైఫ్ కూడా బెస్ట్ మార్కెట్ అని చెప్పొచ్చు. సింగిల్ చార్జ్ పై ఏడు రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుంది.

నాయిస్ ఫిట్ క్రూ ప్రో ధర ఎంతంటే..

ఇక నాయిస్ ఫిట్ క్రూ ప్రో ధర విషయానికి వస్తే ప్రారంభ ధర కింద రూ. 2,199కే లభ్యమవుతోంది. నాయిస్ ఫిట్ వెబ్ సైట్ తో పాటు ఈ-ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో దీనిని కొనుగోలు చేయొచ్చు. మూడు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. క్లాసిక్ బ్లాక్(లెదర్), క్లాసిక్ బ్రౌన్(లెదర్), జెట్ బ్లాక్ ఆప్షన్లతో పాటు క్లాసిక్ బ్లూ, సిల్వర్ గ్రే స్ట్రాప్ ఆప్షన్లతో వస్తుంది.

నాయిస్ ఫిట్ క్రూ ప్రో స్పెసిఫికేషన్లు..

దీనిలో 1.4 అంగుళాల హెచ్ డీ అమోల్డ్ డిస్ ప్లే 240×240 పిక్సల్స్ తో ఉంటుంది. రెండు సైడ్ బటన్స్ ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. అందుకోసం ట్రూ సింక్ టెక్నాలజీని వినియోగించారు. సులభంగా కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకోవడం చేయొచ్చు.

ఇవి కూడా చదవండి

నాయిస్ ఫిట్ క్రూ ప్రో ఫీచర్లు ఇవి..

ఈ వాచ్ లో మార్చుకోదగిన 100 వాచ్ ఫేసెస్ ఉన్నాయి. అలాగే 120 స్పోర్ట్స్ మోడ్లు కూడా ఉన్నాయి. వీటిలో రన్నింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్, వంటి కూడా ఉన్నాయి. హెల్త్ మోనిటరింగ్ కు సంబంధించి ఎస్పీఓ2 మోనిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, ఫీమెయిల్ హెల్త్ ట్రాకింగ్, స్లీప్ మోనిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐపీ68 రేటింగ్ తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ను అందిస్తుంది.

నాయిస్ ఫిట్ క్రూ ప్రో బ్యాటరీ సామర్థ్యం..

ఈ వాచ్ లో 300ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఒక వారం వరకూ నాన్ స్టాప్ గా వినియోగించుకోవచ్చు. నోటిఫికేషన్లు చూసుకోవచ్చు. మెసేజ్ లకు రిప్లై ఇవ్వొచ్చు. క్యాలిక్యులేటర్ ఫీచర్ కూడా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..