Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malware Removal Tool: సైబర్ నేరాల నుంచి రక్షణకు మరో ముందడుగు.. ఆ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటే మీ ఫోన్ సేఫ్

స్మార్ట్‌ఫోన్‌లను రక్షించడంలో వ్యక్తులకు సహాయం చేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) అనేక ఉచిత బోట్ రిమూవల్ టూల్స్‌ను పరిచయం చేసింది. దీని గురించి అవగాహన కల్పించడానికి ప్రభుత్వం కూడా ఎస్ఎంఎస్ నోటిఫికేషన్‌ల ద్వారా వినియోగదారులను చురుగ్గా చేరుతుంది.

Malware Removal Tool: సైబర్ నేరాల నుంచి రక్షణకు మరో ముందడుగు.. ఆ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటే మీ ఫోన్ సేఫ్
Malware
Follow us
Srinu

| Edited By: seoteam.veegam

Updated on: Jun 09, 2023 | 7:07 PM

ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం కొత్త రకమైన దాడులు ప్రజలను వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో పెరుగుతున్న మాల్వేర్ దాడులు, స్కామ్‌లతో ప్రజల పరికరాల భద్రత ప్రధాన ఆందోళనగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వారి స్మార్ట్‌ఫోన్‌లను రక్షించడంలో వ్యక్తులకు సహాయం చేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) అనేక ఉచిత బోట్ రిమూవల్ టూల్స్‌ను పరిచయం చేసింది. దీని గురించి అవగాహన కల్పించడానికి ప్రభుత్వం కూడా ఎస్ఎంఎస్ నోటిఫికేషన్‌ల ద్వారా వినియోగదారులను చురుగ్గా చేరుతుంది. “సైబర్ నేరాల నుంచి సురక్షితంగా ఉండండి! మీ పరికరాన్ని బాట్‌నెట్ ఇన్‌ఫెక్షన్లు, మాల్వేర్ నుంచి రక్షించడానికి, భారత ప్రభుత్వం సీఈఆర్‌టీ-ఇన్ ద్వారా అందిస్తున్న ఉచిత బాట్ రిమూవల్ టూల్‌ను డౌన్‌లోడ్ చేయమని సిఫార్సు చేస్తూ ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయి. ఈ ఎస్ఎంఎస్ వినియోగదారులకు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటానికి రిమైండర్‌గా పనిచేస్తుంది. అలాగే బోట్‌నెట్ ఇన్‌ఫెక్షన్లు, మాల్వేర్ బెదిరింపుల నుంచి  వారి పరికరాలను రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే బోట్‌నెట్ గుర్తింపు అంటే ఏంటి? ప్రభుత్వం అందించిన ఈ ఉచిత సాధనాలను వ్యక్తులు ఎక్కడ యాక్సెస్ చేయవచ్చు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

సైబర్ స్వచ్ఛత పోర్టల్

భారత ప్రభుత్వ ప్రకటన ప్రకారం వ్యక్తులు ఇప్పుడు సైబర్ స్వచ్ఛతా కేంద్ర పోర్టల్ ద్వారా ఉచిత మాల్వేర్ డిటెక్షన్ టూల్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. బోట్‌నెట్ క్లీనింగ్, మాల్వేర్ అనాలిసిస్ సెంటర్ అని కూడా పిలిచే ఈ పోర్టల్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నిర్వహణలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స, యాంటీవైరస్ కంపెనీల సహకారంతో పనిచేస్తుంది. వెబ్‌సైట్ వినియోగదారులకు వారి సిస్టమ్‌లు/పరికరాలను సురక్షితంగా ఉంచడానికి సమాచారంతో పాటు సాధనాలను కూడా అందిస్తుంది. భారతదేశంలో బోట్‌నెట్ ఇన్‌ఫెక్షన్‌లను చురుగ్గా గుర్తించడం ద్వారా సురక్షితమైన సైబర్‌స్పేస్‌ను ఏర్పాటు చేయడం ఈ చొరవ యొక్క ప్రాథమిక లక్ష్యంగా ఉంటుంది. 

బోట్‌నెట్ ఇన్‌ఫెక్షన్ అంటే ఏంటి?

బోట్‌నెట్ అనేది స్మార్ట్‌ఫోన్‌లు లేదా కంప్యూటర్‌ల వంటి ‘బాట్’ అనే మాల్‌వేర్‌తో సంక్రమించిన పరికరాల నెట్‌వర్క్. ఇది సోకిన తర్వాత మాల్వేర్ సోకిన కంప్యూటర్‌లపై హ్యాకర్‌లకు నియంత్రణను ఇస్తుంది. స్పామ్ పంపడం, అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ టెక్స్ట్‌లు, కాల్స్‌ను బ్లాక్ చేయడం, నెట్ బ్యాంకింగ్ వివరాలు, యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌ల వంటి సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడం వంటి వివిధ హానికరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ నియంత్రణ వారిని అనుమతిస్తుంది.

ఇవి కూడా చదవండి

బోట్‌నెట్ సోకుతుందిలా?

  • సోకిన అటాచ్‌మెంట్‌ను ఈ మెయిల్‌లో తెరవడం
  • ఈ-మెయిల్ లేదా వెబ్‌సైట్‌లో హానికరమైన లింక్‌పై క్లిక్ చేయడం
  • అవిశ్వసనీయ సోర్స్ నుండి ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడం
  • సురక్షితం కాని పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌ని ఉపయోగించడం

బోట్‌నెట్ నుంచి రక్షణ ఇలా

  • మీ పరికరానికి బోట్‌నెట్ సోకిందో లేదో తనిఖీ చేయడానికి లేదా బాట్‌లు మరియు మాల్వేర్‌లను తీసివేయండి
  • సీఎస్‌కే వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • సెక్యూరిటీ టూల్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • మీరు ఉపయోగించాలనుకుంటున్న బాట్ రిమూవల్ టూల్ యాంటీవైరస్ కంపెనీని ఎంచుకోండి.
  • ఆ సాధనాన్ని డౌన్‌లోడ్ చేయడానికి “డౌన్‌లోడ్” బటన్‌పై క్లిక్ చేయండి.
  • విండోస్ వినియోగదారులు ఈ స్కాన్ యాంటీవైరస్, కే 7 సెక్యూరిటీ లేదా క్విక్ హీల్ వంటి ఉచిత బోట్ రిమూవల్ టూల్స్‌లో ఒకదానిని డౌన్‌లోడ్ చేయండి.
  • ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి ఈ స్కాన్ సీఈఆర్‌టీ-ఐఎన్ బోట్ రిమూవల్ టూల్ లేదా సీడాక్ హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఎం-కవచ్-2 సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత దాన్ని మీ పరికరంలో రన్ చేయండి.
  • యాప్ మీ పరికరాన్ని మాల్వేర్ కోసం స్కాన్ చేస్తుంది. ఏవైనా ఇన్ఫెక్షన్‌లు కనుగొనబడితే వాటిని తొలగిస్తుంది. 
  • బోట్ రిమూవల్ టూల్స్ కాకుండా సీఎస్‌రూ పోర్టల్ యూఎస్‌బీ ప్రతిరోధ్, ‘యాప్‌సామ్విడ్ వంటి ఇతర భద్రతా అప్లికేషన్‌లను కూడా అందిస్తుంది. వినియోగదారులు తమ భద్రతను పెంచుకోవడానికి ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
  • యూఎస్‌బీ ప్రతిరోధ్ అనేది ఫోన్‌లు, పెన్ డ్రైవ్‌లతో సహా తొలగించగల స్టోరేజ్ మీడియా వినియోగాన్ని నియంత్రించడానికి రూపొందించిన డెస్క్‌టాప్ సాధనం. కొత్త యూఎస్‌బీ పరికరం కనెక్ట్ చేసినప్పుడల్లా వినియోగదారులు ప్రామాణీకరణ ప్రయోజనాల కోసం వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌ను అందించాలి. అదనంగా ఈ సాధనం యూఎస్‌బీ పరికరాలను మాల్వేర్ కోసం స్కాన్ చేస్తుంది. డేటాను సేవ్ చేస్తుంది. అలాగే అనుమతులను చదవడానికి లేదా రాయడానికి మార్పులను అనుమతిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో