Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DogeRAT Malware: మరో డేంజరస్ వైరస్.. యూ ట్యూబ్, నెట్ ఫ్లిక్స్ వినియోగదారులూ బీ అలర్ట్..

ఇప్పుడు డోగేరాట్(రిమోట్ యాక్సెస్ ట్రోజన్) అనే పేరుతో మరో కొత్త మాల్ వేర్ ను వ్యాప్తి చేస్తున్నారు. సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ల ద్వారా యూజర్ల డివైజ్ లలోకి ఈ మాల్ వేర్ ను జొప్పిస్తున్నట్లు బెంగళూరుకు చెందిన క్లౌడ్ సెక్ సైబర్ పరిశోధన సంస్థ ప్రకటించింది.

DogeRAT Malware: మరో డేంజరస్ వైరస్.. యూ ట్యూబ్, నెట్ ఫ్లిక్స్ వినియోగదారులూ బీ అలర్ట్..
Online Frauds
Follow us
Madhu

|

Updated on: Jun 03, 2023 | 7:00 AM

సైబర్ సెక్యూరిటీ ఎంత కచ్చితంగా పనిచేస్తున్నా.. ఎన్ని యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ లను ఇన్ స్టాల్ చేసినా.. ఎన్ని రకాలుగా డేటా భద్రం చేసుకుంటున్నా.. సైబర్ దాడులు ఆగడం లేదు. యూజర్ల డేటా కోసం సైబర్ నేరగాళ్లు ఏదో ఒక కొత్త మార్గంలో చొరబడుతూనే ఉన్నారు. ఒకటి విరుగుడు అయ్యింది అనుకొనేలోపే మరో రూపంలో మాల్ వేర్ ను వ్యాప్తి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకూ నకిలీ ఆండ్రాయిడ్ యాప్ ల ద్వారా గెరిల్లా మాల్ వేర్ దామ్ వైరస్ లతో యూజర్ల ఫోన్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నించిన సైబరాసురులు.. ఇప్పుడు డోగేరాట్(రిమోట్ యాక్సెస్ ట్రోజన్) అనే పేరుతో మరో కొత్త మాల్ వేర్ ను వ్యాప్తి చేస్తున్నారు. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్ ల ద్వారా యూజర్ల డివైజ్ లలోకి ఈ మాల్ వేర్ ను జొప్పిస్తున్నట్లు బెంగళూరుకు చెందిన క్లౌడ్ సెక్ సైబర్ పరిశోధన సంస్థ ప్రకటించింది. దీని సాయంతో బ్యాంకింగ్, బీమా, ఈ కామర్స్, ఎంటర్ టైన్ మెంట్ రంగాల్లో పనిచేస్తున్న ముఖ్యమైన వ్యక్తుల డివైజ్లలోని సమాచారాన్ని హ్యాకర్లు లక్ష్యంగా ఎంచుకున్నారని పేర్కొంది.

నకిలీ యాప్స్ సాయంతో చొరబడుతోంది..

క్లౌడ్ సెక్ చెబుతున్న దాని ప్రకారం ఈ మాల్ వేర్ ఒక గేమ్ లేదా ప్రోడక్టవిటీ టూల్, లేదా ఎంటర్టైన్ మెంట్ యాప్ లు అయిన యూట్యూబ్ నెట్ ఫ్లిక్స్, ఓపెరా మినీ ల వంటి వాటిని పోలిన నకిలీ యాప్ ల ద్వారా ఫోన్లలోకి చొరపడుతోంది. అలాగే ప్రముఖ సోషల్ మీడియా యాప్ లైన టెలిగ్రామ్, ఇన్ స్టా గ్రామ్ ద్వారా మరింత వ్యాప్తి చెందుతోంది. ఒక్కసారి డోగేరాట్ మాల్ వేర్ డివైజ్లలోకి ప్రవేశించిన తర్వాత యూజర్ అనుమతి లేకుండా రిమోట్ యాక్సెస్ ద్వారా ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లోని నంబర్లకు స్పామ్ మెసేజ్ లు పంపడంతోపాటు నగదు చెల్లింపులు, కాల్ రికార్డింగ్ లు వినడం, ఫొటో లేదా వీడియోలు తీసేందుకు హ్యాకర్లకు సాయపడుతుందని క్లౌడ్ సెక్ తెలిపింది.

మాల్వేర్ నుంచి సురక్షితంగా ఉండాలంటే  ఇవి పాటించండి..

మాల్వేర్ దాడులు కొత్తవి కావు, అయితే గత కొన్ని నెలల్లో ఇటువంటి హానికరమైన కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. అందువల్ల, తాజా బెదిరింపుల గురించి తెలుసుకోవడం, అటువంటి మాల్వేర్ నుండి మీ పరికరాన్ని రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. అటువంటి ముందు జాగ్రత్తలు కొన్ని మీకు అందిస్తున్నాం.. అవేంటో చూడండి..

ఇవి కూడా చదవండి
  • తెలియని వ్యక్తులు పంపిన లింక్‌లు, జోడింపులను క్లిక్ చేయడం లేదా తెరవడం మానుకోండి. అవి మాల్వేర్‌ను కలిగి ఉండే అవకాశం ఉన్నందున లేదా మిమ్మల్ని హానికరమైన వెబ్‌సైట్‌లకు తీసుకెళ్లవచ్చు. వాటి విషయంపై అప్రమత్తంగా ఉండండి.
  • ఆపరేటింగ్ సిస్టమ్‌లు, అప్లికేషన్‌లతో సహా మీ సాఫ్ట్‌వేర్‌ను క్రమం తప్పకుండా అప్ డేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ అప్‌డేట్‌లు తరచుగా మీ పరికరాన్ని మాల్వేర్ నుండి రక్షించడంలో సహాయపడే భద్రతా ప్యాచ్‌లను కలిగి ఉంటాయి.
  • మంచి యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ లను కొనుగోలు చేయండి.
  • స్కామర్‌లు బాధితులను మోసం చేసేందుకు అత్యవసర భావాన్ని, భయాన్ని లేదా దురాశను సృష్టించడం వంటి వ్యూహాలను తరచుగా ఉపయోగిస్తారు.
  • మీరు సోషల్ మీడియాలో అనుమానాస్పద సందేశం లేదా ఆఫర్‌ను స్వీకరించినట్లయితే, మీరు వాటి ప్రామాణికతను ధృవీకరించే వరకు ఏ లింక్‌లను క్లిక్ చేయవద్దు లేదా ఏవైనా జోడింపులను తెరవవద్దు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..