Facebook Scam: ఫేస్ బుక్ వినియోగదారులకు అలర్ట్.. ఈ కొత్త స్కామ్ గురించి విన్నారా? ఆ మెసేజ్ కి అస్సలు స్పందించొద్దు..
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఫేస్ బుక్ లో కొత్త తరహా మోసం వెలుగుచూసింది. ‘లుక్ హూ జస్ట్ డైడ్’(look who just died) పేరిట దీనిని రన్ చేస్తున్నారు. ఇది ఆస్ట్రేలియాలో మొదటి బయటకొచ్చింది.

ఆన్ లైన్ మోసాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను వారు మోసాలు, నేరాలు చేయడానికి వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా కూడా మోసాలు జరుగుతున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించడంతో పాటు డబ్బులు కూడా కాజేస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఫేస్ బుక్ లో కొత్త తరహా మోసం వెలుగుచూసింది. ‘లుక్ హూ జస్ట్ డైడ్’(look who just died) పేరిట దీనిని రన్ చేస్తున్నారు. ఇది ఆస్ట్రేలియాలో మొదటి బయటకొచ్చింది. అంటే మీ బాగా దగ్గరి వారు చనిపోయారని చెబుతూ వ్యక్తుల వ్యక్తిగత సమాచారంతో పాటు డబ్బులను లూటీ చేస్తున్నారు. అసలు ఈ మోసం ఏంటి? ఎలా చేస్తున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
ఇలా చేస్తారు..
మీ ఫేస్ బుక్ లో మీ ఫ్రెండ్ మాదిరిగానే హ్యాకర్ డైరెక్ట్ గా మీ ఖాతాకు మెసేజ్ పంపుతాడు. దానిలో ‘లుక్ హూ జస్ట్ డైడ్’(look who just died) ఉంటుంది. అంటే ఎవరు చనిపోయారో తెలుసుకోండి అని అర్థం. దాని కింద ఓ లింక్ కూడా ఇస్తారు. అంటే అది ఒక న్యూస్ ఆర్టికల్ లింక్ లా కనిపిస్తుంది. అలాగే ‘సో స్యాడ్’(so sad), ‘ఐ నో యూ నో హిమ్’(I know you know him) వంటి కొటేషన్లు పెట్టి ట్రాప్ లోకి లాగుతారు. వాటిని చూసిన వినియోగదారుడు మనకు తెలిసిన వారు ఎవరైనా చనిపోయారేమో ఆ లింక్ ని క్లిక్ చేస్తారు. అయితే ఆ లింక్ క్లిక్ చేయగానే ఫేస్ బుక్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ని ఎంటర్ చేయమని అడుగుతుంది. అయితే ఆ లింక్ ఫేక్ న్యూస్ తో పాటు మాల్వేర్ ను క లిగి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ ఫేస్ బుక్ లాగిన్ డిటైల్స్ ఎంటర్ చేస్తారో ఇక అంతే మీ వ్యక్తిగత డేటా మొత్తం హ్యాకర్స్ చేతిలోకి వెళ్లిపోతుంది. ఆ అకౌంట్ మీ నుంచి అతని చేతిలోకి వెళ్తుంది. అక్కడితో అది ఆగదు. మీరు పంపినట్లుగా మీ ఖాతాలోని అందరి ఫ్రెండ్స్ కి అదే మెసేజ్ హ్యాకర్ పంపుతాడు. అంతేకాక హ్యాకర్లు మీ ఖాతాలోని పూర్తి వివరాలు తస్కరించి నాన్ ఫేస్ బుక్ అకౌంట్లలో కూడా వినియోగిస్తారని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఇవి చేయకండి..
మీకు ఫేస్ బుక్ నుండి వచ్చినట్లు కనిపిస్తూ ఉండే అనుమానాస్పద ఈ మెయిల్ లేదా మెసేజ్ లలోని లింక్ లను అస్సలు క్లిక్ చేయొద్దు. మీ ఫేస్ బుక్ నుండి ఇటీవల పంపిన ఈ మెయిల్‌లను మీ సెట్టింగ్‌లలో చూడవచ్చు.



తొందరపాటు వద్దు: స్కామర్‌లు తరచుగా అత్యవసర భావాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు. లేదా మీ ఖాతాను లేదా ఇతర చర్యను కోల్పోతామని బెదిరిస్తారు. కానీ మీరు తొందరపడకుండా తిరిగి ప్రశ్నించడానికి, ఆలోచించడానికి సమయం తీసుకోండి.
స్పాట్ చెక్: మిమ్మల్ని చర్య తీసుకోమని ప్రోత్సహించడానికి స్కామర్‌లు తరచుగా సమస్యను ప్రస్తావిస్తారు. దానిపై మీరు పరిశోధన చేయండి. లింక్‌లను క్లిక్ చేయడానికి లేదా ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ముందు వివరాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.
పంపవద్దు: స్కామర్‌లు తరచుగా తెలిసిన సంస్థకు చెందిన వారిగా నటిస్తారు. వారు మిమ్మల్ని ఒప్పించేందుకు ఇంటర్నెట్ నుంచి దొంగిలించిన ఉద్యోగి ఫోటోను ఉపయోగించవచ్చు. అయితే ఏ పేరున్న సంస్థ అక్కడికక్కడే చెల్లింపును డిమాండ్ చేయదు.
సోషల్ మీడియాలో, స్నేహితుని అభ్యర్థనను అంగీకరించాలా లేదా మెసేజ్ కు ప్రతిస్పందించాలా వద్దా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఈ విషయాలు గమనించండి..
- మీకు తెలియని వ్యక్తులు లేదా ప్రసిద్ధ వ్యక్తులు డబ్బు అడుగుతున్నప్పుడు అనుమానించాలి. రుణం, బహుమతి లేదా ఇతర విజయాలను స్వీకరించడానికి ముందస్తు రుసుము కోసం మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఆలోచించాలి.
- అత్యవసర పరిస్థితుల్లో స్నేహితుడిగా లేదా బంధువుగా చెప్పుకునే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
- మీ సంభాషణను ఫేస్ బుక్ నుండి తరలించమని మిమ్మల్ని అడుగుతున్న వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి.
- వ్యక్తులు మీతో త్వరగా శృంగార సంబంధాన్ని కోరుకుంటున్నారని క్లెయిమ్ చేసి, ఆపై డబ్బు అడుగుతారు.
- పేలవమైన స్పెల్లింగ్, వ్యాకరణ లోపాలు ఉన్న సందేశాలు లేదా పోస్ట్‌లను అనుమానించాలి.
- మీ ఆన్‌లైన్ ఖాతాలో ఏదో తప్పు ఉన్నందున మీ తక్షణ ప్రతిస్పందనను కోరుతూ వచ్చే సందేశాలకు స్పందిచకూడదు.
- మీరు ఆన్‌లైన్‌లో ఉపయోగించే సేవల గురించి ముఖ్యమైన సందేశాన్ని చదవడానికి మీ సోషల్ మీడియా, ఇమెయిల్ చిరునామా లేదా బ్యాంక్ ఖాతాతో లాగిన్ చేయమని మిమ్మల్ని కోరే సందేశాలపై అప్రమత్తత అవసరం
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..