SMS spoofing: ఒక్క మెసేజ్‌తో ఖాతా లూటీ.. కొత్త తరహా ఆన్ లైన్ మోసం.. తస్మాత్ జాగ్రత్త!
హ్యాకర్ మీ మొబైల్ నంబర్ కు ఓ మెసేజ్ పంపుతారు. కొన్నిసార్లు ఆ మెసేజ్ మీకు తెలిసిన నంబర్ నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ మెసేజ్ మంచిదని మీరు నమ్మి దానిలోని లింక్ క్లిక్ చేస్తారో అంతే.. ఆ లింక్ ద్వారా మాల్ వేర్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది.

సాంకేతిక మనిషికి ఎంత సౌలభ్యాన్ని అందించిందో అంతే స్థాయిలో ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఇటీవల కాలంలో ఆన్ లైన్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. డిజిటల్ చెల్లింపుల్లో భాగంగా ప్రతి ఒక్కరూ యూపీఐ పేమెంట్స్ అధికంగా చేస్తున్నారు. ఇది ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతోంది. ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కొనే సైబరాసురులు ఎంత భద్రంగా అకౌంట్లను ఉంచుకుంటున్నా ఏదో ఒక రకంగా అకౌంట్లను లూటీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు అధికంగా ప్రజలకు మోసం చేయడానికి వినియోగిస్తున్న విధానం ఎస్ఎంఎస్ స్పూఫింగ్.. అసలు ఈ ఎస్ఎంఎస్ స్ఫూఫింగ్ అంటే ఏమిటి? దీని నుంచి వినియోగదారులు ఎలా బయట పడాలి? చూద్దాం రండి..
ఎస్ఎంఎస్ స్పూఫింగ్ అంటే..
హ్యాకర్ మీ మొబైల్ నంబర్ కు ఓ మెసేజ్ పంపుతారు. కొన్నిసార్లు ఆ మెసేజ్ మీకు తెలిసిన నంబర్ నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది. లేదా ఏదైనా ప్రజల్లో నమ్మకం కలిగిన కంపెనీ నుంచి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ మెసేజ్ మంచిదని మీరు నమ్మి దానిలోని లింక్ చేస్తారో అంతే.. ఆ లింక్ ద్వారా మాల్ వేర్ మీ ఫోన్లో డౌన్ లోడ్ అవుతుంది. మీ ఫోన్లో ఉన్న యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ పనితీరుకు అనుగుణంగా మాల్ వేర్ మీ ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తుంది. అలాగే బ్యాంకు వివరాలను కూడా కాజేస్తుంది.
ఎస్ఎంఎస్ స్పూఫింగ్ ఎలా చేస్తారంటే..
ఈ ప్రక్రియలో, సైబర్ నేరగాళ్లు ఓ కస్టమ్ ఎస్ఎంఎస్ ఫార్వార్డింగ్ యాప్‌లను సృష్టిస్తారు. దీని ద్వారా యూపీఐకి రిజస్ట్రేషన్ చేసుకోండి అని సూచిస్తూ ఓ మెసేజ్ ని వినియోగదారుల బ్యాంక్‌కు ఖాతాలకు లింకైన వర్చువల్ మొబైల్ నంబర్ (వీఎంఎన్)కి ఫార్వార్డ్ చేస్తుంది. మోసగాళ్లు వాట్సాప్ ద్వారా ఈ హానికరమైన ఏపీకే ఫైల్‌లకు లింక్‌లను కూడా పంపవచ్చు. ఆ లింక్ లను క్లిక్ చేయగానే యూపీఐ అప్లికేషన్ నమోదు ప్రక్రియను ప్రారంభమై, డేటా మోసగాళ్లకు చేరుతుంది. అందుకనే మీరు మీ మొబైల్ పరికరంలో నమ్మదగని మూలాల నుండి ఎలాంటి అనుమానాస్పద/హానికరమైన అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయలేదని నిర్ధారించుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి.



ఎస్ఎంఎస్ స్పూఫింగ్ నుంచి ఇలా చేస్తే భద్రంగా ఉండొచ్చు..
- మీ మొబైల్ లేదా టాబ్లెట్ సెక్యూరిటీ ప్యాచ్‌లతో కూడిన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కి అప్ డేట్ అయి ఉందో లేదో నిర్ధారించుకోండి.
- గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ వంటి అధికారిక విశ్వసనీయ సోర్సెస్ నుంచి మాత్రమే అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేయండి.
- విశ్వసనీయ ప్రొవైడర్ నుండి యాంటీవైరస్ లేదా సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసి, దాన్ని క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయండి.
- మీరు అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసినప్పుడల్లా, మీ ఫోన్‌లో అప్లికేషన్‌కు మీరు ఇస్తున్న అనుమతులను సరిచూసుకోండి. అనేక యాప్‌లు లొకేషన్‌ను గుర్తించడానికి, మెసేజ్‌లను చదవడానికి, ఇతర అంశాలను అసలు అవసరం లేనప్పుడు అనుమతిని కోరుతాయి వాటిని నిరాకరించండి.
- ఈ మెయిల్‌లు లేదా మెసేజ్ లలో అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి.
- తెలియని అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేయడం/ఇన్‌స్టాల్ చేయడం మానుకోండి.
- ఓటీపీ, పాస్‌వర్డ్, పిన్, కార్డ్ నంబర్ వంటి మీ రహస్య సమాచారాన్ని ఎవరితోనూ ఎప్పుడూ షేర్ చేయవద్దు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..