- Telugu News Photo Gallery Technology photos Infinix launching new smartphone Infinix note 30 5g features and price details
Infinix ‘Note 30 5G: రూ. 20 వేలకే 108 ఎంపీ కెమెరా.. ఇన్‌ఫినిక్స్ నుంచి మార్కెట్లోకి స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్
బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఇన్‌ఫినిక్స్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఇన్‌ఫినిక్స్ నోట్ 30 5జీ పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్ ఇదే నెలలో లాంచ్ కానుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత ఉండనుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Jun 02, 2023 | 4:46 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఇన్‌ఫినిక్స్ త్వరలోనే మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఇన్‌ఫినిక్స్ నోట్ 30 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ ఫోన్‌ను తక్కువ ధరలో అందించనున్నారు. ఈ నెల మధ్యలో ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్ ధరకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ రూ. 20,990గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. Note 30 5G ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 6080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేయనుంది. ఇందులో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించనున్నారు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌ను 6GB, 8GB RAM 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్స్‌లో తీసుకురానున్నారు.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. ఇక సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.





























