Ashwini Vaishnaw: మనం వాడే 99 శాతం ఫోన్స్ భారత్‌లో తయారైనవే: కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్
Hosur: గత తొమ్మిదేళ్లలో భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ 20 రెట్లు వృద్ధి చెందిందని, తద్వారా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో ఎగుమతి ఆధారిత వృద్ధిని సాధించే స్థాయికి దేశం చేరుకుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం అన్నారు. హోసూర్‌లోని టాటా ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ 100 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించిందని ప్రకటించారు.

Hosur: మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ త్వరలో ‘ప్రపంచ అగ్రగామి’గా అవతరించనుందని, యాపిల్ ఐఫోన్‌ను భారత్‌లోనే తయారు చేస్తామని కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టాటా గ్రూప్ ఐఫోన్‌లను తయారు చేస్తుందని, భారతదేశంలో అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్ బెంగళూరు సమీపంలోని హోసూర్‌లో నిర్మించనున్నట్లు మంత్రి కొన్ని నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా సోమవారం మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఐఫోన్ ప్లాంట్‌ను సందర్శించారు.
భారతదేశంలోనే అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్ హోసూరులో ఉన్న సంగతి తెలిసిందే. టాటా గ్రూప్ కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (TEPL) దీనిని దక్కించుకుంది. 500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్లాంట్ రూ.5,000 కోట్ల పెట్టుబడితో 15,000 మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పించింది. ఈ యూనిట్‌ను 12-18 నెలల్లో విస్తరించి మరో 10 నుంచి 12 వేల మంది కార్మికులను నియమించుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉపాధి పెరుగుదలతో పాటు భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తి కూడా అనేక రెట్లు పెరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈరోజు, సోమవారం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణబ్ దేశంలోనే అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్, హోసూర్‌లోని టాటా ఫ్యాక్టరీని సందర్శించారు. ఈమేరకు ప్లాంట్ పని తీరును పరిశీలించారు. అలాగే, ఐఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఎంతకాలం పడుతుందనే విషయాలపై ఫోకస్ చేశారు.
Met Mobile industry to review progress.📱Industry has grown 20 times in 9 years.
👉2014: 78% import dependent 👉2023: 99.2% of all mobiles sold in India are ‘Made In India’. pic.twitter.com/SxUeDwNjsn
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 25, 2023
ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఐఫోన్‌లు చైనాలో తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, కోవిడ్ తర్వాత చైనాలో ఐఫోన్ ఉత్పత్తి కొంతవరకు అంతరాయం కలిగింది. ఆ మార్కెట్‌ను కైవసం చేసుకునేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. హోసూర్‌లోని ఫ్యాక్టరీ పూర్తి స్వింగ్‌లో పనిచేయడం ప్రారంభిస్తే, భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తి చాలా రెట్లు పెరుగుతుందని, ప్రపంచ మార్కెట్‌ను కూడా స్వాధీనం చేసుకోవచ్చని భావిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




