Samsung Soundbars: ఆ సామ్‌సంగ్ సౌండ్ బార్స్‌పై అమెజాన్‌లో అదిరే ఆఫర్లు.. ఇక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇంట్లోనే..!

సాధారణంగా ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే పలు రకాల సౌండ్ బార్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే సామ్‌సంగ్ సౌండ్ బార్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ యాప్ అమెజాన్‌లో తాజాగా సామ్‌సంగ్ సౌండ్ బార్‌లపై 50 శాతం తగ్గింపును అందిస్తుంది. కాబట్టి సౌండ్ బార్‌లు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నవారు ఈ ప్రత్యేక ఆఫర్ సమయంలో సౌండ్ బార్‌లు కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

Samsung Soundbars: ఆ సామ్‌సంగ్ సౌండ్ బార్స్‌పై అమెజాన్‌లో అదిరే ఆఫర్లు.. ఇక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇంట్లోనే..!
Samsung Soundbars
Follow us

|

Updated on: Aug 01, 2024 | 5:00 PM

భారతదేశంలో ఏదైనా వస్తువు కొనుగోలు చేసే సమయంలో బేరాలు ఆడడం పరిపాటి. అయితే పెరిగిన టెక్నాలజీ కారణంగా ఇటీవల కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ బాగా పెరిగింది. కాబట్టి ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువుగా కొనుగోలు చేయాలంటే అందులో పేర్కొన్న ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్‌లో ప్రత్యేక ఆఫర్ల కోసం చూస్తూ ఉంటారు. సాధారణంగా ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే పలు రకాల సౌండ్ బార్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే సామ్‌సంగ్ సౌండ్ బార్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ యాప్ అమెజాన్‌లో తాజాగా సామ్‌సంగ్ సౌండ్ బార్‌లపై 50 శాతం తగ్గింపును అందిస్తుంది. కాబట్టి సౌండ్ బార్‌లు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నవారు ఈ ప్రత్యేక ఆఫర్ సమయంలో సౌండ్ బార్‌లు కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్‌లో ఏయే సౌండ్ బార్‌లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

సామ్‌సంగ్ క్యూ సింఫనీ 

అమెజాన్ సేల్ 2024 సామ్‌సంగ్ క్యూ సింఫనీ సౌండ్ బార్ 26 శాతం తగ్గింపులో అందుబాటులో ఉంది. డాల్బీ అట్మోస్‌తో కలిపి మొత్తం 340 వాట్ల అవుట్‌పుట్‌తో వచ్చే ఈ సౌండ్ బార్ రిచ్ బాస్ ఆడియోను అందిస్తుంది. సామ్‌సంగ్ సౌండ్‌బార్ సూపర్ స్టైలిష్ డిజైన్‌లో రావడం వల్ల మీ ఇంటీరియర్‌కు సరిగ్గా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సౌండ్‌బార్ అమెజాన్‌లో రూ.30,990కు అందుబాటులో ఉంది. 

సామ్‌సంగ్ సౌండ్‌బార్ హెచ్‌డబ్ల్యూబీ67ఈ

ఈ మోడల్ వైర్‌లెస్ సబ్ వూఫర్ ప్రస్తుతం 50 శాతం తగ్గింపుతో అందబాటులో ఉంది. 5.1 ఛానెల్ కాన్ఫిగరేషన్, 3డీ సౌండ్‌తో 9 స్పీకర్‌లతో వచ్చే ఈ సామ్‌సంగ్ డాల్బీ అట్మోస్ సౌండ్‌బార్‌పై మీకు అమెజాన్‌లో రూ.24,999కే లభిస్తుంది. అదనపు సబ్‌ వూఫర్‌తో వచ్చే ఈ సౌండ్ బార్ ఇది మీ ఆడియోను మరింత మెరుగుపరుస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో మీరు ఈ పరికరాన్ని సింపుల్‌గా యాడ్ చేయవచ్చు. కుటుంబంతో పాటు మీకు ఇష్టమైన కంటెంట్‌ను చూడడానికి ఈ సౌండ్ బార్ మంచి అనుభూతిని అందిస్తుంది. 

ఇవి కూడా చదవండి

సామ్‌సంగ్ డాల్బీ డిజిటల్ బ్లూటూత్ సౌండ్‌బార్ 

ఈ సామ్‌సంగ్ సౌండ్‌బార్‌పై మీకు 47 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. స్టైలిష్ లుక్‌తో వచ్చే ఈ సౌండ్ బార్ 2.1సీహెచ్ సబ్‌ వూఫర్‌తో వస్తుంది. మొత్తం 120 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను అందించే ఈ  సౌండ్‌బార్‌ మంచి సరౌండ్ సౌండ్ అనుభవం అందిస్తుంది. ఈ సౌండ్‌బార్‌ను బ్లూ టూత్ సాయంతో స్మార్ట్ టీవీ ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ సౌండ్ బార్ కేవలం రూ.రూ. 8,998కే అందుబాటులో ఉంటుంది. 

సామ్‌సంగ్ క్యూ సింఫనీ వైర్‌లెస్ సౌండ్ బార్ 

ఈ సామ్‌సంగ్ సౌండ్‌బార్‌పై అమెజాన్‌లో 30 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. వైర్‌లెస్ సబ్ వూఫర్‌ వల్ల రిచ్ బాస్ బూస్ట్‌ ఆస్వాదించడంతో పాటు డాల్బీ అట్మాస్/డాల్బీ ట్రూ హెచ్‌డితో  సూపర్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చు. సూపర్ స్టైలిష్ డిజైన్‌తో వచ్చే ఈ సౌండ్ బార్ మంచి సౌండ్ సిగ్నల్‌ను అందిస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ సౌండ్ బార్ రూ. 44,999కు అందుబాటులో ఉంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..