AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Stethoscope: 15 సెకన్లలో గుండె జబ్బులను గుర్తించే AI స్టెతస్కోప్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?

ఏఐ ఇది ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. అలాగే వైద్య రంగలోనూ ఇది పెను మార్పులు తీసుకువస్తోంది. తాజాగా లండన్ కు చెందిన పరిశోధకులు గుండెజబ్బులను ముందే గుర్తించే కొత్త AI స్టెతస్కోప్‌ను కనుగొన్నారు. ఈ స్టెతస్కోప్ ద్వారా 15 సెకన్లలో ప్రమాదకరమైన గుండె జబ్బులను గుర్తించవచ్చని వారు చెబుతున్నారు. అయితే ఇది ఎలా పనిచేస్తుంది. ఇది ఎలా గుండె జబ్బులను గుర్తిస్తుంది అనేది ఇక్కడ తెలుసుకుందాం.

AI Stethoscope: 15 సెకన్లలో గుండె జబ్బులను గుర్తించే AI స్టెతస్కోప్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?
Ai Stethoscope
Anand T
|

Updated on: Sep 02, 2025 | 10:23 PM

Share

ఈ మధ్య కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది గుండె సంబంధిత వ్యాధులు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు ముఖ్య కారణం ఈ గుండె సంబంధిత వ్యాధులను ముందే గుర్తించలేక పోవడం. ఈ జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించలేకపోవడంతో అవి తీవ్రతరమై ప్రాణాలు పోయే పరిస్థితికి చేరుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన లండన్‌ శాస్త్రవేత్తలు.. ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు.. సరికొత్త టెక్నాలజీతో AI-ఆధారిత స్టెతస్కోప్‌ను రూపొందించారు. ఈ స్టెతస్కోప్‌ ద్వారా అతి ప్రమాదకరమైన గుండె జబ్బులను కేవలం 15 సెకన్లలోనే కనిపెట్టవచ్చని వారు చెబుతున్నారు.

ఈ AI స్టెతస్కోప్‌ను ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఇంపీరియల్ కాలేజ్ హెల్త్‌కేర్ పరిశోధకులు UK పరిశోధన ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశారు. సాధారణంగా వైద్యులు ఉపయోగించే స్టెతస్కోప్‌ను అప్‌గ్రేడ్ చేసి ఈ కొత్త AI స్టెతస్కోప్‌ ను తయారుచేశారు. ఇది ఒక ప్లేయింగ్ కార్డ్ సైజులో ఉంటుంది.

AI స్టెతస్కోప్ ఎలా పని చేస్తుంది?

  • ఈ AI స్టెతస్కోప్‌ను రోగి ఛాతీపై ఉంచినప్పుడు, గుండె విద్యుత్ సంకేతాలను ECG రికార్డ్ చేసుకుంటుంది. అలాగే ఇందులో ఉండే మైక్రోఫోన్ గుండె రక్త ప్రవాహ శబ్దాలను రికార్డ్ చేస్తుంది
  • ఈ రికార్డైన సమాచారాన్ని బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది. ఇందుకోసం ఒక ప్రత్యేక యాప్‌ను వీరు రూపోందించారు.
  • అక్కడి నుండి వచ్చిన డేటా మొత్తం క్లౌడ్ సర్వీస్‌కు పంపబడతాయి.
  • ఈ AI ద్వారా సేకరించబడిన సమాచారాన్ని వైద్య బృందం విశ్లేషించి, సూక్ష్మమైన శారీరక సమస్యలను గుర్తిస్తారు.
  • చివరగా, రోగి గుండె పరిస్థితిపై ఒక నివేదిక రెడీ అవుతుంది. అది వెంటనే అతని స్మార్ట్‌ఫోన్‌కు పంపబడుతుంద.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.