నో రెస్ట్.. విండీస్ టూర్‌కు రెడీ – విరాట్ కోహ్లీ
ప్రపంచకప్ టోర్నీ ముగిసింది. 46 రోజుల ఈ టోర్నీ క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు 27 ఏళ్ళ తర్వాత విశ్వవిజేతగా అవతరించింది. ఇక టీమిండియా విండీస్ పర్యటనకు సన్నద్ధం అవుతోంది. ఇది ఇలా ఉండగా భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న తాజా నిర్ణయానికి సెలెక్టర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. వరుస పర్యటనలతో అలుపు లేకుండా ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, బుమ్రాలతో సహా పలువురు సీనియర్లకు వెస్టిండీస్ టూర్‌కు విశ్రాంతినివ్వాలని […]
ప్రపంచకప్ టోర్నీ ముగిసింది. 46 రోజుల ఈ టోర్నీ క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు 27 ఏళ్ళ తర్వాత విశ్వవిజేతగా అవతరించింది. ఇక టీమిండియా విండీస్ పర్యటనకు సన్నద్ధం అవుతోంది. ఇది ఇలా ఉండగా భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న తాజా నిర్ణయానికి సెలెక్టర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
వరుస పర్యటనలతో అలుపు లేకుండా ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, బుమ్రాలతో సహా పలువురు సీనియర్లకు వెస్టిండీస్ టూర్‌కు విశ్రాంతినివ్వాలని సెలెక్టర్లు భావించారు. అయితే వరల్డ్‌కప్ సెమీస్‌లో టీమిండియా అనుకోని విధంగా నిష్క్రమించడం.. వన్డే కెప్టెన్సీ మార్పుపై వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విరాట్ కోహ్లీ విండీస్ పర్యటనకు అందుబాటులో ఉంటానని బీసీసీఐకు చెప్పినట్లు తెలుస్తోంది.
తనకు విశ్రాంతి అవసరం లేదని విండీస్ పర్యటనకు వెళ్తానని సెలెక్టర్లతో కోహ్లీ చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు ఆటగాళ్ల ఎంపిక సెలెక్టర్లతో పాటు బీసీసీఐకి కూడా తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. టీమిండియా విండీస్ పర్యటనలో భాగంగా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.
ఆగష్టు 3న జరిగే తొలి టీ20తో వెస్టిండిస్ పర్యటన ప్రారంభం కానుంది. “విండీస్ పర్యటనకు విశ్రాంతి తీసుకోవడానికి కోహ్లీకి ఇష్టపడటం లేదు, ప్రపంచకప్ ఓటమి అనంతరం అతడు చాలా కుంగిపోయాడు. క్రికెట్‌తోనే మళ్ళీ పునరుత్తేజం లభిస్తుందని భావించడంతో కోహ్లి తన నిర్ణయం మార్చుకున్నాడు” అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాకు తెలియజేశాడు. అటు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ సిరీస్‌లో ఆడతాడో లేదో వేచి చూడాలి.