MI vs RR: ముంబైపై గ్రాండ్ విక్టరీ.. కేకేఆర్, పంజాబ్‌లకు షాక్.. ప్లేఆఫ్ చేరిన రాజస్థాన్..!
Mumbai Indians vs Rajasthan Royals Result, IPL 2026: ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి, ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. బలమైన ముంబై ఇండియన్స్ (MI) జట్టును చిత్తు చేస్తూ 30 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Mumbai Indians vs Rajasthan Royals Result, IPL 2026: ఐపీఎల్ ఈ సీజన్‌లోని చివరి డబుల్ హెడర్‌ను ఆదివారం ఆడుతోంది. ఆ రోజు జరిగిన మొదటి మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్‌కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ టార్గెట్‌ను ఛేజ్ చేయలేక పోయిన ముంబై టీం చేతులెత్తేసింది. దీంతో రాజస్థాన్ ప్లేఆఫ్స్ చేరింది. రాజస్థాన్ ప్లేఆప్స్ చేరడంతో పంజాబ్, కోల్‌కతా ఆశలు ఆవిరయ్యాయి. ఇక రెండో మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడుతోన్న కోల్‌కతా టీం మ్యాచ్ ఏమాత్రం విలువ లేకుండా పోయింది.
మైదానంలోకి అడుగుపెట్టినప్పటి నుంచే రాజస్థాన్ రాయల్స్ జట్టులో గెలుపు కసి స్పష్టంగా కనిపించింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ బ్యాటర్లు ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరును సాధించారు. మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ముంబై బౌలర్లు వికెట్లు తీయడానికి శ్రమించినప్పటికీ, రాజస్థాన్ ఇన్నింగ్స్ జోరును మాత్రం అడ్డుకోలేకపోయారు.
లక్ష్య చేధనలో తడబడిన ముంబై ఇండియన్స్..
206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ బౌలర్ల పదునైన లైన్ అండ్ లెంగ్త్ బంతులకు ముంబై టాప్ ఆర్డర్ తలవంచక తప్పలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ముంబై జట్టు తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. మధ్య వరుస బ్యాటర్లు కాసేపు పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ, పెరిగిపోతున్న రన్ రేట్ ఒత్తిడిని తట్టుకోలేకపోయారు.
చివరకు ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబై బ్యాటర్లను కట్టడి చేసి, జట్టు విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.
With the bat 🔥 With the ball 🔥🔥
Jofra Archer coming in clutch for #RR 🩷
Updates ▶️ https://t.co/h2ze7K0gd6#TATAIPL | #KhelBindaas | #MIvRR | @rajasthanroyals pic.twitter.com/En2h01xvdC
— IndianPremierLeague (@IPL) May 24, 2026
ప్లేయింగ్-11..
ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, అల్లా ఘజన్‌ఫర్, రఘు శర్మ.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, యశ్ రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
