Watch : వాంఖడే స్టేడియంలో పాకిస్థాన్ రేంజ్ కామెడీ రనౌట్.. నవ్వు ఆపుకోలేకపోతున్న ఫ్యాన్స్
Watch : ముంబై బౌలర్ విల్ జాక్స్ ప్రమాదకరంగా మారుతున్న జైస్వాల్‌ను అవుట్ చేసి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. ఆ వెంటనే యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా కేవలం 4 పరుగులకే పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ రాయల్స్ ఒక్కసారిగా ఒత్తిడిలో పడిపోయింది.

Watch : ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ మ్యాచ్‌లు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. మే 24న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఒక సాధారణ రనౌట్ కాస్తా.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరచూ చేసే ఫన్నీ రనౌట్లను గుర్తు చేస్తూ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. రాజస్థాన్ రాయల్స్‌కు ఈ మ్యాచులో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది.ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు చేసిన కామెడీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజాగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ క్రీజులోకి వస్తూనే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం కొన్ని బంతుల్లోనే 27 రన్స్ చేసి మంచి పునాది వేశాడు. అయితే, ముంబై బౌలర్ విల్ జాక్స్ ప్రమాదకరంగా మారుతున్న జైస్వాల్‌ను అవుట్ చేసి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. ఆ వెంటనే యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా కేవలం 4 పరుగులకే పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ రాయల్స్ ఒక్కసారిగా ఒత్తిడిలో పడిపోయింది.
వికెట్లు పడుతున్న సమయంలో జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత కెప్టెన్ రియాన్ పరాగ్‌పై పడింది. కానీ అతను కూడా 8 బంతుల్లో 14 రన్స్ చేసి అల్లా మహ్మద్ ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాజస్థాన్‌ను ధ్రువ్ జురెల్, దసున్ శనక కలిసి కాపాడే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా శ్రీలంక ఆల్‌రౌండర్ శనక ముంబై బౌలర్లపై కౌంటర్ ఎటాక్ చేస్తూ వేగంగా రన్స్ రాబట్టాడు. జురెల్ అతనికి సింగిల్స్ తీస్తూ మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరి పార్ట్‌నర్‌షిప్ కుదురుకుంటోంది అనే సమయంలో అసలు కథ మొదలైంది.
ఇన్నింగ్స్ 11వ ఓవర్లో కార్బిన్ బాష్ వేసిన ఒక షార్ట్ డెలివరీని ధ్రువ్ జురెల్ బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు నెట్టాడు. బంతిని కొట్టగానే జురెల్ సింగిల్ కోసం పిలిచాడు.. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శనక కూడా అంతే వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చాడు. అయితే ఫీల్డర్ బంతి వైపు వేగంగా రావడం చూసి జురెల్ తన నిర్ణయాన్ని మార్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే శనక క్రీజు సగానికి పైగా దాటేశాడు. దాంతో ఇద్దరు బ్యాటర్లు పిచ్‌కి ఒకే వైపున ఉండిపోయారు.
— crictalk (@crictalk7) May 24, 2026
బంతిని అందుకున్న శార్దూల్ ఠాకూర్ మొదట కలెక్ట్ చేయడంలో కొంచెం తడబడ్డాడు. అయినప్పటికీ వెంటనే కోలుకుని బౌలర్ వైపు బంతిని విసిరాడు. బౌలర్ కార్బిన్ బాష్ కూడా ఆ త్రోను అందుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు, కానీ చివరికి ఎలాగోలా బంతులను వికెట్లకు కొట్టేసి బేయిల్స్ పడగొట్టాడు. దీనివల్ల బాగా ఆడుతున్న దసున్ శనక (15 బంతుల్లో 29 రన్స్) దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. 100 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోవడంతో రాజస్థాన్ రాయల్స్ మళ్లీ కష్టాల్లో పడింది. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాల్సిన మ్యాచ్‌లో ఇలాంటి చిన్న తప్పు పెద్ద దెబ్బే కొట్టింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
