శిష్యుడి సిక్సర్ చూసి.. కోచ్ మృతి!

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ వరల్డ్‌కప్ సూపర్ ఓవర్‌లో సిక్స్ కొట్టిన అనంతరం అతని చిన్ననాటి హైస్కూల్ కోచ్ డేవిడ్ జేమ్స్ గోర్డాన్ టెన్షన్ తట్టుకోలేక గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. ఇక ఈ విషయాన్ని ఆయన కూతురు స్వయంగా వెల్లడించింది. వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్.. బౌండరీల కౌంట్‌తో విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోర్డాన్ కూతురు లియోని మాట్లాడుతూ.. ‘సూపర్ ఓవర్ సెకండ్ బాల్‌ను నీషమ్ సిక్స్‌గా మలిచిన […]

శిష్యుడి సిక్సర్ చూసి.. కోచ్ మృతి!
Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Jul 18, 2019 | 7:53 PM

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ వరల్డ్‌కప్ సూపర్ ఓవర్‌లో సిక్స్ కొట్టిన అనంతరం అతని చిన్ననాటి హైస్కూల్ కోచ్ డేవిడ్ జేమ్స్ గోర్డాన్ టెన్షన్ తట్టుకోలేక గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. ఇక ఈ విషయాన్ని ఆయన కూతురు స్వయంగా వెల్లడించింది. వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్.. బౌండరీల కౌంట్‌తో విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోర్డాన్ కూతురు లియోని మాట్లాడుతూ.. ‘సూపర్ ఓవర్ సెకండ్ బాల్‌ను నీషమ్ సిక్స్‌గా మలిచిన వెంటనే, తన తండ్రి తుది శ్వాస విడిచారని చెప్పింది. మ్యాచ్ సూపర్ ఓవర్ చేరుకోగానే.. ఆయన శ్వాసలో మార్పు వచ్చిందని.. నీషమ్ సిక్స్ కొట్టగానే ప్రాణాలు కోల్పోయారని లియోని తెలిపింది. ఇక ఈ విషయం తెలుసుకున్న జిమ్మీ నీషమ్ తన ట్విట్టర్ ద్వారా జేమ్స్ మృతికి సంతాపం వ్యక్తం చేశాడు.