కోహ్లీ ఆట‌తీరు అద్భుతం: మాథ్యూ హెడెన్‌

ఒక‌వైపు స‌హ‌చ‌రులంద‌రూ నిష్క్ర‌మిస్తున్నా ప‌ట్టుద‌ల‌తో ఆడి అద్భుత సెంచరీ సాధించిన టీమిండియా సార‌థి విరాట్ కోహ్లీపై క్రీడాభిమానులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. కోహ్లీ అద్భుత ఆట‌ను కొనియాడుతూ సోషల్ మీడియాలో తెగ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో శుక్ర‌వారం జ‌రిగిన మూడో వన్డేలో కోహ్లీ ఆట‌తీరును సామాన్యులే కాకుండా మాజీ ఆట‌గాళ్లు సైతం ఫిదా అయ్యారు. ఆస్ట్రేలియా మాజీ ఓపెన‌ర్‌, దిగ్గ‌జ ఆట‌గాడు మాథ్యూ హెడెన్ కూడా కోహ్లీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. కోహ్లీ ఒక అద్భుత‌మ‌ని కొనియాడాడు. […]

కోహ్లీ ఆట‌తీరు అద్భుతం: మాథ్యూ హెడెన్‌
Follow us

|

Updated on: Mar 09, 2019 | 4:33 PM

ఒక‌వైపు స‌హ‌చ‌రులంద‌రూ నిష్క్ర‌మిస్తున్నా ప‌ట్టుద‌ల‌తో ఆడి అద్భుత సెంచరీ సాధించిన టీమిండియా సార‌థి విరాట్ కోహ్లీపై క్రీడాభిమానులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. కోహ్లీ అద్భుత ఆట‌ను కొనియాడుతూ సోషల్ మీడియాలో తెగ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో శుక్ర‌వారం జ‌రిగిన మూడో వన్డేలో కోహ్లీ ఆట‌తీరును సామాన్యులే కాకుండా మాజీ ఆట‌గాళ్లు సైతం ఫిదా అయ్యారు.
ఆస్ట్రేలియా మాజీ ఓపెన‌ర్‌, దిగ్గ‌జ ఆట‌గాడు మాథ్యూ హెడెన్ కూడా కోహ్లీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. కోహ్లీ ఒక అద్భుత‌మ‌ని కొనియాడాడు. `నేను గ‌త జ్ఞాప‌కాల‌ను గుర్తుకు తెచ్చుకుంటున్నా. బ్రియాన్ లారా, స‌చిన్ టెండూల్క‌ర్ మొద‌లైన దిగ్గ‌జ ఆట‌గాళ్లంతా ఒక్కొక్క స‌మ‌యంలో గొప్ప ఆటతీరు ప్ర‌ద‌ర్శించారు. కానీ, కోహ్లీ మాత్రం చాలా సుల‌భంగా అన్ని ఫార్మాట్ల‌లోనూ అద‌ర‌గొడుతున్నాడు. శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు క‌ష్ట‌మైన పిచ్‌పై అత‌డి ఆట‌తీరు అద్భుతం. అత‌డి బ్యాటింగ్ చూస్తుంటే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందేమో అనిపించింది. మైదానానికి న‌లువైపులా మంచి షాట్లు కొట్టాడు. మ్యాచ్‌ను గెలిపించ‌డానికి శాయ‌శ‌క్తులా కృషి చేశాడ‌ని హెడెన్ అన్నాడు.