Tokyo Olympics 2021: భారీ అంచనాలతో భయపడొద్దు.. ఆటలో 100 శాతం ఇస్తే.. విజయం మీదే: అథ్లెట్లతో ప్రధాని మోడీ

టోక్యో ఒలింపిక్స్ మరో పది రోజుల్లో మొదలు కానున్నాయి. ఈమేరకు అన్ని దేశాల ఆటగాళ్లు ఇప్పటికే టోక్యో బయలు దేరేందుకు సిద్ధమయ్యారు.

Tokyo Olympics 2021: భారీ అంచనాలతో భయపడొద్దు.. ఆటలో 100 శాతం ఇస్తే.. విజయం మీదే: అథ్లెట్లతో ప్రధాని మోడీ
Pm Narendra Modi
Follow us

| Edited By: Venkata Chari

Updated on: Jul 20, 2021 | 11:57 AM

Tokyo Olympics 2021:  టోక్యో ఒలింపిక్స్ మరో పది రోజుల్లో మొదలు కానున్నాయి. ఈమేరకు అన్ని దేశాల ఆటగాళ్లు ఇప్పటికే టోక్యో బయలు దేరేందుకు సిద్ధమయ్యారు. మనదేశం నుంచి దాదాపు 120 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో ఆడేందుకు అర్హత సంపాదించారు. మొదటి విడతగా కొంతమంది అథ్లెట్లు జులై 17న టోక్యో వెళ్లనున్నారు. ఈమేరకు ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు నేడు (మంగళవారం) భారత ప్రధాని అథ్లెట్లతో సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా ఈ మీటింగ్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అథ్లెట్లందరినీ ప్రోత్సహిస్తూ, పలు విధాలుగా ధైర్యం చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అందరితో మాట్లాడిన పీఎం మోడీ.. మీపై ఉన్న అంచనాలకు భయపడొద్దని, ధైర్యంగా ముందడుగు వేయాలని కోరాడు.

మేరీ కోమ్, సానియా మీర్జా, దీపికా కుమారి, నీరజ్ చోప్రాలతోపాటు ఇతర ప్లేయర్లతోనూ మాట్లాడారు. ప్రస్తుత ఒలింపిక్స్ కొంచెం కొత్తగా అనిపించవచ్చు. అలాగే అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలని, ఆటపై మనసు లగ్నం చేసి, 100 శాతం ప్రయత్నించి, విజయం సాధించాలని పీఎం కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. ఆర్చర్ దీపికా కుమారి ప్రపంచ నంబర్ వన్ గా తిరిగి రావాలని ప్రధాని ఈ సందర్భంగా కోరారు. అలాగే ప్రవీణ్ జాదవ్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాలను ప్రశంసించారు. ‘ఎన్నో అంచనాలు మీపై ఉంటాయి. కానీ, వాటిని చూసి భయపడకూడదు. ఆటలో 100 శాతం ఇస్తే.. తప్పక విజయం సాధిస్తారని’ పీఎం మోడీ సూచించారు.

టెన్నిస్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోతున్న సానియామీర్జాతో పలు విషయాలపై చర్చించారు. భారత్‌లో టెన్నిస్‌ అభివృద్ధి చెందాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అడిగారు. మహిళల డబుల్స్‌లో బరిలో దిగబోతున్న అంకిత రైనాతో సమన్వయం చేసుకోవాలని కోరారు. రికర్వ్‌ ప్రపంచ నంబర్‌వన్‌ దీపిక కుమారి, 5 సార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌తో కూడా ప్రధాని మోడీ చర్చించారు.

‘‘మీరు ప్రపంచ నంబర్‌వన్‌. ప్రస్తుత మీ ప్రయాణం చాలా ప్రత్యేకమైందని’’ ఆర్చర్‌ దీపిక కుమారితో ప్రధాని అన్నారు. ‘‘మీ అభిమాన అథ్లెట్‌, నచ్చిన పంచ్‌ ఏమిటి?’’ అంటూ మేరీ కోమ్‌ను అడిగారు. అందుకు ‘‘మహ్మద్‌ అలీ హుక్‌ పంచ్‌’’ అంటూ మేరీ కోమ్ సమాధానమిచ్చింది. బాక్సర్‌ ఆశిష్‌ కుమార్‌లో ఉత్సాహం పెంచేందుకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ను ఉదాహరణగా చూపించారు. తండ్రిని కోల్పోయినా.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్‌లో ఆడిన సచిన్‌ను గుర్తుచేసుకోవాలని సూచించారు. మన్‌ప్రీత్‌ (హాకీ), నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రో), శరత్‌ కమల్‌, మనిక (టేబుల్‌ టెన్నిస్‌), సౌరభ్‌ చౌదరి (షూటింగ్‌), ఆశిష్‌ కుమార్‌ (బాక్సింగ్‌)లతో కూడా ప్రధాని మోడీ మాట్లాడారు.

Also Read:

టీమిండియాను గట్టి దెబ్బ తీశాడు.. అదరగొట్టే డబుల్ సెంచరీతో విజయాన్ని అందించాడు.. అతడెవరంటే.!

సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్ధం.. భారీ బడ్జెట్‌తో తెరపైకి.. హీరోగా ఇద్దరి పేర్లు..!

IND vs SL: వన్డేలు, టీ20ల్లో భారత్‌పై అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన శ్రీలంక ప్లేయర్లు వీరే..!

Latest Articles