Tokyo Olympics 2021: 5 ఏళ్ల వయసులో అనాథ.. నేడు ఒలింపిక్స్‌లో దేశం తరపున బరిలోకి..!

ఐదేళ్ల వయసులో అనాథగా మారిన ఓ చిన్నారి, నేడు ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున పతకం సాధించేందుకు బరిలోకి దిగనుంది. చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడిన ఆ చిన్నారి, నేడు దేశం గర్వించే స్థాయికి ఎదిగింది.

Tokyo Olympics 2021: 5 ఏళ్ల వయసులో అనాథ.. నేడు ఒలింపిక్స్‌లో దేశం తరపున బరిలోకి..!
Revathi Veeramani
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Venkata Chari

Updated on: Jul 20, 2021 | 11:57 AM

Tokyo Olympics 2021: ఐదేళ్ల వయసులో అనాథగా మారిన ఓ చిన్నారి, నేడు ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున పతకం సాధించేందుకు బరిలోకి దిగనుంది. చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడిన ఆ చిన్నారి, నేడు దేశం గర్వించే స్థాయికి ఎదిగింది. ఒలింపిక్స్‌లో పరిగెత్తాలనే తన కలను నేడు నిజం చేసుకోబోతోంది. డబ్బులు లేకపోవడంతో బూట్లు కూడా కొనలేక.. చెప్పులు కూడా లేకుండా పరుగెత్తేది. ఆమే.. తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలోని సకిమంగళం గ్రామానికి చెందిన రేవతి వీరమణిని (23). ఒలింపిక్స్ 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలే జట్టులో భాగమై, పతకం సాధించేందుకు బరిలోకి దిగనుంది. ఈ సందర్భంగా ఈ అథ్లెట్ పీటీఐతో మాట్లాడింది. తన జీవితంలోని అతి క్లిష్టమైన రోజులను గుర్తు చేసుకుంది. ఈ మేరకు రేవతి మాట్లాడుతూ..”నా తండ్రికి ఉదర సంబంధ వ్యాధితో మరణించాడు. ఆయన చనిపోయినప్పుడు నాకు ఆరేళ్లు కూడా లేవు. నాన్న చనిపోయన ఆరు నెలల తరువాత మా అమ్మ ఎన్సెఫాలిటిస్ కారణంగా కన్నుమూసిందని” కన్నీళ్లతో చెప్పుకొచ్చింది.

‘నన్ను, నా సోదరిని మా అమ్మమ్మ అరామల్ పెంచారు. మమ్మల్ని పెంచేందుకు ఆమె చాలా కష్టపడింది. చాలా తక్కువ డబ్బు కోసం పొలం పనులు, ఇటుక బట్టీలలో పనిచేసేది. మా బంధువులు మమ్మల్ని కూడా పనికి పంపమని అమ్మమ్మకు సలహా ఇచ్చారు. కానీ, ఆమె నిరాకరించింది. మేము పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని అమ్మమ్మ కోరికని’ రేవతి పేర్కొంది. రేవతి, ఆమె సోదరి 76 సంవత్సరాల వారి అమ్మమ్మ కారణంగా పాఠశాలకు వెళ్ళగలిగారు. అయితే ఈ ఇద్దరిలో చాలా ప్రతిభ దాగుంది. చదువుల్లో చూపించిన ప్రతిభతోనే రేవతికి రైల్వేలోని మదురై విభాగంలో టీటీఈగా ఉద్యోగం లభించింది. అలాగే రేవతి చెల్లెలు ప్రస్తుతం చెన్నైలో పోలీసు అధికారిగా పనిచేస్తోంది. పాఠశాలలో చదివే రోజుల్లో రేవతి ప్రతిభను తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ కోచ్ కె. కన్నన్ గుర్తించారు. రేవతి అమ్మమ్మ మొదట్లో ఆమెకు పరిగెత్తడానికి అనుమతి ఇవ్వలేదు. కానీ, కన్నన్ ఆమెను ఒప్పించి రేవతికి లేడీ డాక్ కాలేజీలో సీటుతో పాటు మదురైలోని హాస్టల్‌లో చోటు సంపాదించాడు.

కాలేజీలో చెప్పులు లేకుండా నడిచేది.. రేవతి మాట్లాడుతూ, ‘నానమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. నా సోదరి, నేను ఈ స్థితిలో ఉన్నామంటే కారణం మాత్రం మాఅమ్మమ్మే. క్రీడల పరంగా పోత్సాహమిచ్చింది మాత్రం కన్నన్ సార్. నేను కాలేజీ పోటీలతో పాటు 2016 కోయంబత్తూరులో జరిగిన నేషనల్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కూడా చెప్పులు లేకుండా నడిచాను. కన్నన్ సర్ తరువాత నాకు అవసరమైన అన్ని వస్తువులను ఏర్పాటు చేశాడని’ పేర్కొంది. రేవతి కన్నన్ మార్గదర్శకత్వంలో 2016 నుంచి 2019 వరకు శిక్షణ పొందింది. తరువాత పాటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్) లో జరిగిన జాతీయ శిబిరంలో ఎంపికయ్యారు.

కన్నన్ మార్గదర్శకత్వంలో 100 మీ, 200 మీటర్ల పరుగులో ప్రతిభ చూపిన రేవతిని.. 400 మీ. జాతీయ శిబిరంలో పాల్గొనమని గలీనా మేడం పోత్సహించింది. ‘ నన్ను 400 మీటర్లలో పరిగెత్తమని గలీనా మేడం అడిగారు. కన్నన్ సార్ కూడా ఇందుకు అంగీకరించారు. అలా నేను 400 మీటర్లలో పోటీ చేశాను. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం నేను నా మొదటి ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నాను. నేను ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని కన్నన్ సార్ నాకు ఇది వరకే చెప్పారు. ఈ విషయాలు చాలా వేగంగా జరిగాయని అనిపిస్తోంది. నా కల నిజమైంది. ఒలింపిక్స్‌లో దేశం తరపున ఆడడం.. ఇంత త్వరగా నెరవేరుతుందని నేను ఊహించలేదు. ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు నా వంతు కృషి చేస్తానని’ ఆమె వెల్లడించింది.

Also Read:

Copa America Cup 2021: ఈ విజయం వారికే అంకితం..ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ భావోద్వేగం!

INDW vs ENGW: రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన భారత యువ సంచలనం.. 18 ఏళ్లు నిండకుండానే నెంబర్ వన్..! ఎందులోనో తెలుసా?

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?