Copa America Cup 2021: ఈ విజయం వారికే అంకితం..ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ భావోద్వేగం!
ఆదివారం జరిగిన కోపా అమెరికా కప్ లో అర్జెంటీనా జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 28 ఏళ్ల తరువాత మరోసారి కోపా అమెరికా కప్‌ను సొంతం చేసుకుంది.
Copa America Cup 2021: ఆదివారం జరిగిన కోపా అమెరికా కప్ లో అర్జెంటీనా జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 28 ఏళ్ల తరువాత మరోసారి కోపా అమెరికా కప్‌ను సొంతం చేసుకుంది. అలాగే అర్జెంటీనా దిగ్గజ ప్లేయర్ లియోనల్ మెస్సీ సారథ్యంలో తొలిసారి ఓ అంతర్జాతీయ కప్‌ను గెలుచుకుంది. ఈమేరకు అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ.. కోపా అమెరికా కప్ ను దివంగత స్టార్ ఆటగాడు డీగో మారడోనాతోపాటు కరోనా బాధిత కుటుంబాలకు అంకితమిచ్చాడు. ఈ మేరక ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నాడు. అయితే, అర్జెంటీనా దిగ్గజ ప్లేయర్ మారడోనాకు కలగా మిగిలిన కోపా అమెరికా కప్‌ను.. మెస్సీ నాయకత్వంలో సాధించింది. ఈమేరక మెస్సీ మాట్లాడుతూ, అర్జెంటీనా జట్టు కోపా అమెరికా టైటిల్ గెలవాలని మారడోనా కోరుకున్నాడని, ఆయన కలను నేరవేర్చడం నిజంగా నా అదృష్టమని తెలిపాడు.
మారడోనా భౌతికంగా తమ మధ్య లేడు. కానీ, ఆయన ఆత్మ జట్టును ప్రోత్సహిస్తూనే ఉంటుందని, అభిమానులు విజయోత్సవాలను నిర్వహించే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఈ విజయంతో లభించిన సంతోషంతో కరోనా వైరస్‌పై కలిసికట్టుగా పోరాడుదామని మెస్సీ పిలుపునిచ్చాడు. తనను అర్జెంటైన్‌గా పుట్టించినందుకు ఆ దేవుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగంతో ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం జరిగిన కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా, బ్రెజిల్ టీంలు తలపడ్డాయి. 1-0తో అర్జెంటీనా విజయం సాధించింది. అయితే, ఈమ్యాచ్‌లో అర్జెంటీనా దిగ్గజ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఒక్క గోల్ కూడా చేయకపోవడం గమనార్హం. అర్జెంటీనా ట్రోఫీ గెలవడంతో ఆ దేశ ఆటగాళ్లు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది మెస్సీ కెరీర్‌లోనూ అతిపెద్ద అంతర్జాతీయ టోర్నీ విజయంగా నిలిచిపోయింది.
View this post on Instagram
Also Read:
Euro 2020: గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ ఎవరికి దక్కాయో తెలుసా..? అవార్డుల పూర్తి జాబితా..!