- Telugu News Photo Gallery Sports photos Euro 2020 full list of award winners golden boot prize money in euro 2020
Euro 2020: గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ ఎవరికి దక్కాయో తెలుసా..? అవార్డుల పూర్తి జాబితా..!
యూరో 2020 టోర్నమెంట్ అంతటా ఇటలీ జట్టు అజేయంగా నిలిచింది. ఛాంపియన్‌గా నిలవడంతోపాటు టోర్నీలోనే అత్యధిక గోల్ స్కోరర్ జట్టుగా పేరుగాంచింది.
Updated on: Jul 12, 2021 | 9:47 PM

యూరో 2020 ఫుట్‌బాల్ థ్రిల్ ముగిసింది. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ టీంకు మరోసారి నిరాశే ఎదురైంది. ట్రోర్నీ అంనతరం ఆటగాళ్లకు బహుమతులు అందించారు. యూరప్‌లో కొత్త ఛాంపియన్‌గా నిలిచిన ఇటలీకి 10 మిలియన్ యూరోలు లభించాయి. భారత్ కరెన్సీలో రూ. 88 కోట్లకు పైగా ఉంటుంది. మరోవైపు, రన్నరప్ ఇంగ్లాండ్‌కు 7 మిలియన్ యూరోలు అంటే రూ. 62 కోట్ల రూపాయలు అందాయి.

అలాగే ఆటగాళ్లకు కూడా ప్రత్యేక అవార్డులు లభించాయి. ఈ టోర్నమెంట్‌లో అత్యధికంగా 5 గోల్స్ చేసిన పోర్చుగల్ స్టార్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డోకు గోల్డెన్ బూట్ లభించింది. వెండి బూట్ చెక్ రిపబ్లిక్ ప్లేయర్ పాట్రిక్ స్కీక్ కు దక్కగా, కాంస్య బూట్ ఫ్రాన్స్‌కు చెందిన కరీం బెంజ్మాకు లభించింది.

యూరో 2020 ఫైనల్లో ఇంగ్లాండ్‌పై ఇటలీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన లియోనార్డో బోనుసికి స్టార్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌తో పాటు గోల్డెన్ బాల్ టైటిల్ ఇటాలియన్ గోల్ కీపర్ జియాన్లూజీ డోనారుమ్మకు దక్కింది. అలాగే స్పెయిన్ యువ ప్లేయర్ పెద్రికి టోర్నమెంట్ యంగ్ ప్లేయర్ అవార్డు లభించింది.

యూరో 2020 లో అత్యధిక గోల్స్ చేసిన జట్లుగా ఇటలీ, స్పెయిన్ టీంలు నిలిచాయి. ఇటలీ 7 మ్యాచ్‌ల్లో 13 గోల్స్ సాధించగా, స్పెయిన్ 6 మ్యాచ్‌ల్లో 13 గోల్స్ సాధించింది. ఫిన్లాండ్, టర్కీ, స్కాట్లాండ్ అతి తక్కువ గోల్స్ సాధించిన లిస్టులో చేరాయి. ఈ మూడు జట్లు 3 మ్యాచ్‌ల్లో 1-1 గోల్స్ సాధించాయి.

ఈ ఏడాది టోర్నమెంట్‌లో బెస్ట్ ఢిఫెన్స్ టీంగా ఇంగ్లండ్ (7 మ్యాచ్‌ల్లో 2 గోల్స్) నిలవగా, చెత్త ఢిపెన్స్‌తో ఉక్రెయిన్ (5 మ్యాచ్‌లలో 10 గోల్స్) నిలిచింది.



