Tokyo Olympics 2021: ఎనిమిది ఒలింపిక్స్‌లో మూడు దేశాల తరపున పాల్గొన్న అథ్లెటిక్‌కు ఘనమైన వీడ్కోలు

Tokyo Olympics 2021: ప్రపంచంలోని ప్రతిదేశం క్రీడాకారుడి యొక్క కల ఒక్కసారైనా ఒలింపిక్స్ లో తమ దేశం తరపున పాల్గొనాలని..కోరుకుంటాడు. అలాంటిది ఉజ్బెకిస్తాన్‌కు చెందిన మహిళా వాల్ట్‌ జిమ్నాస్ట్‌..

Tokyo Olympics 2021: ఎనిమిది ఒలింపిక్స్‌లో మూడు దేశాల తరపున పాల్గొన్న అథ్లెటిక్‌కు ఘనమైన వీడ్కోలు
Oksana Chusovitina
Follow us

|

Updated on: Aug 08, 2021 | 10:38 AM

Tokyo Olympics 2021: ప్రపంచంలోని ప్రతిదేశం క్రీడాకారుడి యొక్క కల ఒక్కసారైనా ఒలింపిక్స్ లో తమ దేశం తరపున పాల్గొనాలని..కోరుకుంటాడు. అలాంటిది ఉజ్బెకిస్తాన్‌కు చెందిన మహిళా వాల్ట్‌ జిమ్నాస్ట్‌ ఒక్సానా చుసోవిటినా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది ఒలింపిక్స్ లో పాల్గొని చరిత్ర సృష్టించింది.1992 బార్సిలోనా ఒలింపిక్స్‌ నుంచి మొదలైన ఆమె ఒలింపిక్స్ జర్నీ 2020 టోక్యో ఒలింపిక్స్‌ తో ముగిసింది. 8 ఒలింపిక్స్‌లో మూడు దేశాల తరపున ఒలింపిక్స్‌ ఆడిన చుసోవిటినా 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో రజత పతకం గెలుచుకుంది.

అత్యధిక ఒలింపిక్స్ లో పాల్గొన్న 46 ఏళ్ల చుసోవిటినా కు టోక్యో ఒలింపిక్స్ లోస్టాండింగ్‌ ఒవేషన్‌ లభించింది. స్టేడియంలోని అందరూ నిలబడి చప్పట్లతో ఆమెను అభినందించారు. అయితే తనకు గోల్డ్ మెడల్ సాధించలేదనే బాధ ఉందని తెలిపింది ఒక్సానా చుసోవిటినా.

Also Read:   నీరజ్ చోప్రా తినే ఆహారంలో మ్యాచ్‌కు ముందు ఈ చేప ఉండాల్సిందే ఎందుకంటే..