Sania Mirza: నెరవేరని సానియా కల.. ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ ఓటమితో కన్నీరుమున్నీరైన హైదరాబాదీ టెన్నిస్‌ క్వీన్‌

. శుక్రవారం ఉదయం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సానియా మీర్జా-బోపన్న జోడి స్టెఫానీ-రఫెల్‌ (బ్రెజిల్‌) చేతిలో 6-7, 2-6 తేడాతో భారత జోడి ఓడిపోయింది. ఇక ఈ ఓటమితో సానియా గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ కెరీర్‌ కు తెరపడినట్లయింది.

Sania Mirza: నెరవేరని సానియా కల.. ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ ఓటమితో కన్నీరుమున్నీరైన హైదరాబాదీ టెన్నిస్‌ క్వీన్‌
Sania Mirza
Follow us

|

Updated on: Jan 27, 2023 | 11:01 AM

ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను గెల్చుకుని కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలన్న సానియా మీర్జా ఆశలు ఆడియాశలయ్యాయి. ఇప్పటికే మహిళల డబుల్స్‌లో ఓడిపోయిన సానియా.. తాజాగా మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్లోనూ పరాజయం పాలైంది. శుక్రవారం ఉదయం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సానియా మీర్జా-బోపన్న జోడి స్టెఫానీ-రఫెల్‌ (బ్రెజిల్‌) చేతిలో 6-7, 2-6 తేడాతో భారత జోడి ఓడిపోయింది. ఇక ఈ ఓటమితో సానియా గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ కెరీర్‌ కు తెరపడినట్లయింది. కాగా మ్యాచ్ అనంతరం సానియా భావోద్వేగానికి గురైంది. ఇక గ్రాండ్‌స్లామ్‌లో ఆడలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కాగా మెల్‌బోర్న్‌ వేదికగానే తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌ను ప్రారంభించిందీ టెన్నిస్‌ క్వీన్‌. ఇప్పుడు అదే గడ్డపై ఆటకు వీడ్కోలు పలకడం కొసమెరుపు. ‘నేను 2005లో మెల్‌బోర్న్‌ వేదికగా ప్రొఫెషనల్ టెన్నిస్‌ కెరీర్‌ను ప్రారంభించాను. గ్రాండ్‌స్లామ్ కెరీర్‌కు వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి వేదిక మరొకటి ఉండదు. ఇక 18 ఏళ్ల క్రితం ఇక్కడే సెరెనా విలియమ్స్‌తో కలిసి ఆడాను. కరోలినాతో కూడా ఆడాను. ఈ మైదానం నాకు చాలా ప్రత్యేకం. కుమారుడి సమక్షంలో గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడుతానని ఊహించలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు ఎప్పుడూ గౌరవమే’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లతో తన ప్రసంగాన్ని ముగించింది సానియా.

కాగా సానియా కెరీర్‌లో ఇది 11వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్. ఆమె ఆరు గ్రాండ్ స్లామ్‌లతో సహా మొత్తం 43 డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది. గతంలో మహిళల డబుల్స్ విభాగంలో 91 వారాల పాటు డబ్ల్యూటీఏ నంబర్ 1 ప్లేయర్‌గా సానియా కొనసాగింది. ఇక మ్యాచ్ అనంతరం రోహన్‌ బోపన్న తదితరులు మాట్లాడుతూ యువతరం టెన్నిస్ క్రీడాకారులకు సానియా స్ఫూర్తిదాయకమని ప్రశంసలు కురిపించారు. ఇక వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్‌లో సానియా తన చివరి టోర్నమెంట్‌ను ఆడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..