పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి.. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుకి కాంస్యం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల పట్టికలో చోటు దక్కించుకుంది. మహిళల పిస్టల్ 10 మీటర్ల షూటింగ్ క్రీడలో భారత ఆశాకిరణం మను బాకర్ బోణీ కొట్టింది. గత ఒలింపిక్స్ లో దారుణంగా విఫలమైన మను ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం అత్యుత్తమంగా రాణించింది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 221.7 పాయింట్లు సాధించిన మనుబాకర్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల పట్టికలో చోటు దక్కించుకుంది. భారత షూటింగ్ స్టార్ మను భాకర్ భారతీయుల అంచనాలను పూర్తిగా నిజం చేసింది. మహిళల పిస్టల్ 10 మీటర్ల షూటింగ్ క్రీడలో భారత ఆశాకిరణం మను బాకర్ బోణీ కొట్టింది. 20 ఏళ్ల తర్వాత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలోఫైనల్ లో అడుగు పెట్టి చరిత్ర సృష్టించిన మను ఆదివారం జరిగిన తుది పోరులో కూడా అదే జోరుని కొనసాగించింది. గత ఒలింపిక్స్ లో దారుణంగా విఫలమైన మను ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం అత్యుత్తమంగా రాణించింది. షూటింగ్ విభాగంలో మెడల్ సాధించిన తొలి మహిళా షూటర్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించింది.
10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 221.7 పాయింట్లు సాధించిన మనుబాకర్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో దక్షిణ కొరియాకు చెందిన ఇద్దరు కొరియన్లకు బంగారం, వెండి పతకాలు దక్కాయి.
హర్యానా అందించిన క్రీడా కుసుమం
హర్యానా బాక్సర్లు, మల్లయోధులకు ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రం నుంచి వచ్చిన క్రీడాకారులు ప్రపంచ వ్యాప్తంగా మన దేశ జాతీయ జెండాను ఎగురవేసి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్నారు. షూటింగ్ గర్ల్ మను భాకర్ కూడా ఇదే రాష్ట్రం నుంచి వచ్చి ఆదివారం అంటే జూలై 28న మళ్లీ దేశ ప్రతిష్టను ఇనుమడింప జేసేలా జాతీయ జెండాను ఎగురవేసింది. హర్యానాలోని ఝజ్జర్‌లో జన్మించిన మను భాకర్‌కు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఆసక్తి. ఆమె తరచుగా టెన్నిస్, స్కేటింగ్ , బాక్సింగ్ వరకు అనేక రకాల పోటీలలో పాల్గొనేది. దీంతో పాటు ‘థాన్ టా’ అనే మార్షల్ ఆర్ట్‌లో పాల్గొని జాతీయ స్థాయిలో పతకం సాధించింది.
View this post on Instagram
చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి
మను భాకర్‌కు 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తన కెరీర్‌ను ఎంచుకుని షూటింగ్‌లో సత్తా చాటాలని నిర్ణయించుకుంది. రియోఒలింపిక్స్ 2016లో జరినప్పుడు షూటింగ్ ప్రాక్టీస్ కోసం పిస్టల్ తీసుకురావాలని తన తండ్రి రామ్ కిషన్ ని కోరింది. మను తండ్రి కూడా కుమార్తె నిర్ణయాన్ని గౌరవించి పిస్టల్‌ను ఇచ్చాడు. నాటి నిర్ణయం నేడు మను భాకర్‌ను ఒలింపియన్‌గా చేసింది.
షాకింగ్ రివర్సల్ చేసింది
2017లో మను భాకర్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఒలింపియన్ , మాజీ ప్రపంచ నంబర్-1 క్రీడాకారిణి హీనా సిద్ధూను ఓడించింది. అంతేకాదు ఆమె 2017 లో ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని కూడా గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె దేశంలో ప్రసిద్ధి చెందిన షూటింగ్ క్రీడాకారిణి అయింది.
తొలి ప్రపంచకప్‌లోనే రికార్డు సృష్టించింది
మను భాకర్ మెక్సికోలోని గ్వాడలజారాలో జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో అరంగేట్రం చేసి తన అరంగేట్రం మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్లో ఆమె ఒలింపిక్ బంగారు పతక విజేత, ప్రపంచ కప్ విజేతను ఓడించింది.. కేవలం 16 సంవత్సరాల వయస్సులో ISSF ప్రపంచ కప్‌లో బంగారు పతకం సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది. అప్పటి నుంచి మను విజయాల పరంపర ఆగలేదు.. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లోనూ అదే జోరు కొనసాగించి కాంస్య పతకం అందించి మన దేశ జాతీయ జెండాను ఎగురవేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..