Junior Hockey World Cup : భారత్‌లో వద్దని సన్నాయి నొక్కులు..జూ. హాకీ ప్రపంచ కప్ నుంచి వైదొలగిన పాక్..!
భారత్, పాకిస్థాన్‌ల మధ్య రాజకీయ, సైనిక ఉద్రిక్తతలు క్రీడా మైదానంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నవంబర్-డిసెంబర్ 2025లో భారతదేశంలో జరగనున్న జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ తప్పుకుంటున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య శుక్రవారం నాడు కన్ఫాం చేసింది.

Junior Hockey World Cup : భారత్, పాకిస్థాన్‌ల మధ్య రాజకీయ, సైనిక ఉద్రిక్తతలు క్రీడా మైదానంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నవంబర్-డిసెంబర్ 2025లో భారతదేశంలో జరగనున్న జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ తప్పుకుంటున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య శుక్రవారం కన్ఫాం చేసింది. తమిళనాడులోని చెన్నై, మధురైలో జరగాల్సిన ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ పాల్గొనకపోవడం, రెండు దేశాల మధ్య క్షీణిస్తున్న క్రీడా సంబంధాలను మరోసారి స్పష్టం చేసింది. ఈ ఏడాది భారత్ నిర్వహించిన క్రీడా ఈవెంట్ నుంచి పాకిస్థాన్ తప్పుకోవడం ఇది రెండోసారి.
2025 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 28 వరకు భారతదేశంలోని చెన్నై, మధురై నగరాల్లో జూనియర్ హాకీ ప్రపంచ కప్ జరగనుంది. ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్థాన్ తన జట్టును ఉపసంహరించుకుంది. ఈ ఏడాది భారత్‌లో జరగాల్సిన టోర్నమెంట్ నుంచి పాకిస్థాన్ తప్పుకోవడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మెన్స్ ఆసియా కప్ నుంచి కూడా పాకిస్థాన్ ఇంతకు ముందు వైదొలిగింది.
టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌ను మొదట గ్రూప్-బిలో భారత్, చిలీ, స్విట్జర్లాండ్‌లతో పాటు చేర్చారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తరువాత రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. భారత ప్రభుత్వం ఇటీవల కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రీడా పోటీలను పరిమితం చేస్తూనే, బహుళ-దేశాల టోర్నమెంట్‌లలో పాల్గొనడాన్ని కొనసాగించాలని నిర్ణయించింది.
పాకిస్థాన్ వైదొలగిన విషయం తమకు తెలియదని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలనాథ్ సింగ్ తెలిపారు. నెలన్నర కిందట తాము పీహెచ్‌ఎఫ్ అధికారులతో మాట్లాడినప్పుడు వారు పాల్గొంటామని చెప్పారని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని అన్నారు. భారత్‌లో ఆడటానికి పాకిస్థాన్ హాకీ సమాఖ్య ఆసక్తి చూపకపోగా, టోర్నమెంట్‌ను తటస్థ వేదికలో నిర్వహించాలని పాకిస్థాన్ హాకీ సమాఖ్యని అభ్యర్థించింది. పీహెచ్‌ఎఫ్ సెక్రటరీ జనరల్ రాణా ముజాహిద్ మాట్లాడుతూ.. తమ క్రీడాకారులు తటస్థ వేదికల్లో కూడా చేతులు కలపడానికి సిద్ధంగా లేనప్పుడు భారత్‌లో ఆడాలని మమ్మల్ని ఎలా ఆశిస్తారు?” అని ప్రశ్నించారు.
పెద్ద ఈవెంట్‌లను కోల్పోవడం వల్ల తమ హాకీ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, అందుకే తాము తటస్థ వేదికను ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ హాకీ సమాఖ్యని కోరినట్లు ముజాహిద్ వివరించారు. ఈ సంఘర్షణకు ముందే అన్ని ఈవెంట్‌లు భారత్‌కు కేటాయించినట్లు పాకిస్థాన్ హాకీ సమాఖ్య చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




