New Wide Ball Rule : క్రికెట్లో కొత్త రూల్.. ఇకపై అవన్నీ వైడ్ బాల్స్ కావు
క్రికెట్‌లో బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లకు మరింత బ్యాలెన్స్ తీసుకురావడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను ప్రవేశపెడుతోంది. తాజాగా, వైడ్ బాల్ నియమంలో ఒక కీలక మార్పు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఇప్పుడు లెగ్ సైడ్ వైపు వెళ్లే ప్రతి బంతిని వైడ్‌గా ప్రకటించరు.

New Wide Ball Rule : క్రికెట్లో బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లకు మరింత బ్యాలెన్స్ తీసుకురావడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను ప్రవేశపెడుతోంది. తాజాగా, వైడ్ బాల్ నియమంలో ఒక కీలక మార్పు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఇప్పుడు లెగ్ సైడ్ వైపు వెళ్లే ప్రతి బంతిని వైడ్‌గా ప్రకటించరు. ఈ మార్పు బౌలర్లకు కొంచెం ఉపశమనం కలిగించనుంది.
క్రికెట్ ఫార్మాట్‌లలో వైడ్ బాల్ నియమం బౌలర్‌లకు కఠినంగా ఉండేది. ముఖ్యంగా లెగ్ సైడ్ బయటకు వెళ్లే బంతులు చాలా వరకు వైడ్‌గా ప్రకటించబడేవి. కానీ ఇప్పుడు ఆ నిబంధన మారింది. గతంలో బ్యాట్స్‌మెన్ ఆఫ్ స్టంప్‌కు వెలుపల ఉండేలా ఒక గైడ్‌లైన్ ఉండేది. దాని ప్రకారం అంపైర్ వైడ్ నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు అలాంటిదే ఒక గైడ్‌లైన్‌ను బ్యాట్స్‌మెన్ లెగ్ సైడ్ వైపు కూడా ఏర్పాటు చేశారు.
బంతి ఈ లెగ్ సైడ్ గైడ్‌లైన్ లోపల ఉంటే, అది వైడ్‌గా పరిగణించబడదు. గైడ్‌లైన్‌కు వెలుపల వెళ్లే బంతులను మాత్రమే వైడ్‌గా ప్రకటిస్తారు. బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో కదులుతూ బౌలర్‌ను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేసినప్పుడు, బౌలర్ విసిరిన బంతి లెగ్ సైడ్ వైడ్ అవుతుండేది. ఈ కొత్త నియమం ద్వారా బౌలర్‌లు అలాంటి వైడ్ బాల్స్ నుంచి కాస్త ఉపశమనం పొందనున్నారు.
🚨 New Wide Ball Rule on Trial 🚨
ICC is testing a fresh wide-ball rule in the Africa Qualifiers 👀
🔹Old rule: anything passing outside leg stump = wide ❌🔹New rule: if the ball passes within a new white line on the leg side 👉 not a wide ✅
#CricketEverywhere pic.twitter.com/QueYXWRZsz
— Associate Chronicles (@AssociateChrons) September 29, 2025
వన్డే క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌లకు పరుగులు చేయడం కష్టంగా మారుతుండటానికి రెండు కొత్త బంతుల నియమం కూడా ఒక కారణం. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో 34 ఓవర్ల వరకు రెండు కొత్త బంతులతో ఆడతారు. ఆ తరువాత మిగిలిన 16 ఓవర్లకు (డెత్ ఓవర్స్) ఒకే బంతిని ఉపయోగిస్తారు. గతంలో మ్యాచ్ మొత్తానికి ఒకే బంతిని వాడేవారు. దీనివల్ల బంతి పాతబడి రివర్స్ స్వింగ్ అయ్యే అవకాశం ఉండేది. కానీ, రెండు కొత్త బంతుల వల్ల 34 ఓవర్ల వరకు రివర్స్ స్వింగ్ రావడం కష్టమవుతోంది. ఇది డెత్ ఓవర్లలో బౌలర్‌లకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది.
బౌండరీ వద్ద క్యాచ్‌లు పట్టే సమయంలో ఉన్న నియమంలో కూడా ఐసీసీ మార్పు చేసింది. ఫీల్డర్ బౌండరీ వెలుపల నుంచి బంతితో సంబంధం కలిగి ఉంటే ఆ క్యాచ్ చెల్లదు. ఫీల్డర్ బౌండరీ వెలుపల ఉన్నప్పటికీ, బంతిని ఒకసారి మాత్రమే బౌండరీ లోపలికి ఎగరవేసి, ఆ తరువాత లోపలికి వచ్చి క్యాచ్ అందుకోవచ్చు. అయితే, ఈ ప్రక్రియలో బంతితో ఫీల్డర్ శరీరానికి రెండోసారి టచ్ అయితే అది బౌండరీగా పరిగణించబడుతుంది. ఈ నియమం ద్వారా క్యాచ్‌లు పట్టడంలో క్లారిటీ పెరుగుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




