AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : సిడ్నీలో కింగ్ హ్యాట్రిక్ కొడతాడా.. అలా చేస్తే కోహ్లీ పేరు మీద భారీ చెత్త రికార్డు

భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ సిరీస్‌లో చివరి వన్డే మ్యాచ్ కోసం టీమిండియా సిడ్నీ చేరుకుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి మరోసారి టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పైనే ఉంది. ఎందుకంటే, గత రెండు వన్డేల్లో కోహ్లీ పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు.

Virat Kohli : సిడ్నీలో కింగ్ హ్యాట్రిక్ కొడతాడా.. అలా చేస్తే కోహ్లీ పేరు మీద భారీ చెత్త రికార్డు
Virat Kohli
Rakesh
|

Updated on: Oct 24, 2025 | 4:26 PM

Share

Virat Kohli : భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ సిరీస్‌లో చివరి వన్డే మ్యాచ్ కోసం టీమిండియా సిడ్నీ చేరుకుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి మరోసారి టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పైనే ఉంది. ఎందుకంటే, గత రెండు వన్డేల్లో కోహ్లీ పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. ఒకవేళ సిడ్నీలో జరిగే మూడవ వన్డేలో కూడా విరాట్ సున్నా పరుగులకే ఔటైతే, అనవసర రికార్డును తన పేరు మీద లిఖించుకునే ప్రమాదం ఉంది.

భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఖాతా తెరవలేకపోయాడు. పెర్త్, ఆడిలైడ్ వన్డేలలో అతను సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఒకవేళ విరాట్ కోహ్లీ సిడ్నీలో కూడా సున్నా పరుగులకే ఔటైతే, వన్డే క్రికెట్ చరిత్రలో వరుసగా మూడు సార్లు సున్నా పరుగులకే ఔటైన ఆరో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు. ఈ జాబితాలో ఇప్పటికే సచిన్ టెండూల్కర్, సూర్యకుమార్ యాదవ్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ వంటి దిగ్గజాలు ఉన్నారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఏ భారత ఆటగాడు కూడా ఒకే సిరీస్‌లో వరుసగా మూడు సార్లు డకౌట్లు అయిన దాఖలాలు లేవు.

ఒకవేళ సిడ్నీలో విరాట్ కోహ్లీ సున్నా పరుగులకే ఔటైతే, ఒకే వన్డే సిరీస్‌లో వరుసగా మూడు డకౌట్లు సాధించిన తొలి భారత ఆటగాడిగా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు. విరాట్ కోహ్లీ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో మునుపటి ప్రదర్శన కూడా అంతగా బాగోలేదు. ఇది కోహ్లీ అభిమానులకు కాస్త ఆందోళన కలిగిస్తోంది. కోహ్లీ సిడ్నీలో ఆడిన 7 వన్డే మ్యాచ్‌లలో కేవలం 146 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 25 కంటే తక్కువగా ఉంది. ఈ పేలవమైన గణాంకాలు మూడో వన్డేపై ఒత్తిడిని పెంచుతున్నాయి.

గత రెండు మ్యాచ్‌లలో కోహ్లీ రెండు వేర్వేరు బంతులకు ఔటయ్యాడు. బయటకు వెళ్తున్న బంతికి, అలాగే లోపలికి వస్తున్న బంతిని కూడా అర్థం చేసుకోలేక వికెట్ కోల్పోయాడు. వన్డే క్రికెట్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సున్నా పరుగులకు ఔటైన ఆటగాళ్ల జాబితాలో పలువురు దిగ్గజాల పేర్లు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ (భారత్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), టామ్ లాథమ్ (న్యూజిలాండ్), లాన్స్ క్లూజ్నర్ (దక్షిణాఫ్రికా), సూర్యకుమార్ యాదవ్ (భారత్), షోయబ్ మాలిక్ (పాకిస్థాన్) వంటి గొప్ప ఆటగాళ్లు కూడా ఈ డకౌట్ హ్యాట్రిక్‌ను నమోదు చేశారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం